ఇన్నోవేషన్‌ ఎవరి సోత్తూ కాదు: మంత్రి కేటీఆర్‌

30 Aug, 2021 14:46 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఇన్నోవేషన్‌ ఎవరి సోత్తూ కాదని ఐటీ, మున్సిప‌ల్ శాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. సోమవారం ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చరల్ యూనివర్సిటీలో మంత్రి కేటీఆర్‌ ఇన్నోవేటివ్‌ హబ్‌ను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఇన్నోవేషన్‌ ఎవరి సోత్తూ కాదని, ఎవరు ఏ కొత్త పరికరం కనిపెట్టినా ప్రోత్సహించాలని పేర్కొన్నారు. 20 లక్షల ఎకరాల్లో ఆయిల్‌పామ్‌ పండించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని  తెలిపారు.

ఆయిల్‌పామ్‌ విషయంలో తెలంగాణ రాష్ట్రం.. దేశానికే ఆదర్శంగా నిలవాలని అన్నారు. టీ-ఫైబర్‌ను హైస్పీడ్‌ ఇంటర్నెట్‌తో అనుసంధానం చేస్తున్నామని తెలిపారు. శాస్త్రవేత్తలు రైతులతో నేరుగా సంభాషించే అవకాశం కల్పిస్తున్నామని మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు. 

చదవండి: Schools Reopen In Telangana: సెప్టెంబర్‌ 1 నుంచి స్కూళ్లు: బడి బండి భద్రమేనా?

మరిన్ని వార్తలు