నెమలీక.. ఆనంద జ్ఞాపిక

20 Sep, 2022 08:26 IST|Sakshi

బంజారాహిల్స్‌: బంజారాహిల్స్‌లోని కేబీఆర్‌ పార్కులో సహజ సిద్ధంగా నేలపై రాలిపోయిన నెమలీకలను చిన్నారులు తీసుకోవడానికి అభ్యంతరం చెప్పవద్దని మంత్రి కేటీఆర్‌ పార్కు నిర్వాహకులకు సూచించారు. అయిదేళ్ల బాలుడి తల్లి చేసిన ట్వీట్‌కు స్పందించిన ఆయన ఈ సూచన చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి.. 


ఆదివారం తన అయిదేళ్ల కొడుకు వేదాంతతో కలిసి ఓ మహిళ కేబీఆర్‌ పార్కుకు వెళ్లారు. ఆ సమయంలో చిన్నారి వేదాంత నెమలీకలను సేకరించి వాటితో ఆడుకుంటూ సంబరపడసాగాడు. ఈ దృశ్యం ఆమెకు ఎంతో ఆనందాన్నిచి్చంది. కానీ.. ఆ నెమలీకలను చిన్నారి వెంట తీసుకెళ్లడానికి పార్కు నిర్వాహకులు అనుమతి ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో ఆమె మంత్రి కేటీఆర్‌కు ట్వీట్‌ చేశారు.

ఈ రోజు తన కొడుకుతో పాటు చాలా మంది పిల్లలు నెమలీకలు సేకరించి వాటితో సంబరపడుతూ వెళ్తుంటే నిర్వాహకులు అడ్డుకున్నారు అని ఆమె కేటీఆర్‌ దృష్టికి తీసుకొచ్చారు. స్పందించిన కేటీఆర్‌.. పిల్లలు నెమలీకలను తీసుకోవడానికి పార్కు నిర్వాహకులు అనుమతి ఇవ్వాలని సూచించారు. చిన్నారుల ముఖంలో సంతోషం చూడాలన్నారు. ఆ తల్లి ట్వీట్‌ తనను కదిలించిందని పేర్కొన్నారు.    

(చదవండి: పాస్‌పార్ట్‌ కార్యాలయానికి గవర్నర్‌ తమిళ సై)

మరిన్ని వార్తలు