KTR: ట్విటర్‌ వేదికగా బీజేపీ, ప్రధానిపై కేటీఆర్‌ ఘాటు విమర్శలు.. వరుస సెటైర్లు

31 Mar, 2022 10:03 IST|Sakshi

తెలంగాణ మంత్రి కేటీఆర్‌.. దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి థ్యాంక్యూ అంటూనే సెటైర్లు వేశారు. ఈ ఉదయం నుంచే వరుస ట్వీట్లతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, ప్రధాని మోదీపై విమర్శనాత్మక పోస్టులు చేస్తున్నారు.

తెలంగాణలో 2019 నుంచి 38 లక్షల నల్లా కనెక్షన్లు ఇచ్చామని, మహిళలకు ఊరట ఇచ్చామని ప్రధాని పేరిట ఒక ప్రకటన వెలువడింది. దానిని ప్రస్తావిస్తూ.. ‘మిషన్‌ భగీరథ పథకం కోసం కేంద్రం ఏమేర సహకారం అందించిందో చెప్పాలంటూ ప్రధాని మోదీని నిలదీశారు. ఏ మాత్రం సాయం అందించకుండా.. ప్రధాని హోదాలో ఇలా ప్రచారం చేసుకోవడం తగదని కేటీఆర్‌ అన్నారు.  

అంతేకాదు గత ప్రభుత్వ హయాంలో ధరల పెంపు, ఇతర సమస్యలపై స్వయంగా మోదీ చేసిన ట్విటర్‌ పోస్టుల తాలుకా స్క్రీన్ షాట్లను షేర్‌ చేసిన కేటీఆర్‌.. ఇప్పుడు అదే జరగుతున్నా ఎందుకు మౌనంగా ఉంటున్నారంటూ ట్వీట్‌ ద్వారా నిలదీశారు. ఆపై పెట్రో ధరల పెంపు వార్తాంశాన్ని ప్రస్తావిస్తూ ‘థ్యాంక్యూ మోదీ జీ, అచ్చెదిన్‌’ అంటూ వ్యంగ్యం ప్రదర్శించారు కేటీఆర్‌. 

అంతటితోనే ఆగలేదు.. బీజేపీ డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌కు అర్థం.. ధరల్ని డబుల్‌ చేయమే అనే అర్థం అంటూ చేసిన ఓ పోస్ట్‌ను రీట్వీట్‌ చేశారు కేటీఆర్‌. 

మరిన్ని వార్తలు