మున్సిపల్‌ శాఖ మంత్రిగా అందరూ నన్నే ట్రోల్‌ చేస్తారు: కేటీఆర్‌

4 Sep, 2021 14:53 IST|Sakshi

హైదరాబాద్‌: క్యాన్సర్‌ రోగుల కోసం హైదరాబాద్‌లోని ఖాజాగూడలో నూతనంగా నిర్మించిన స్పర్శ్‌ హాస్పిస్‌ భవనాన్ని మంత్రి కేటీఆర్‌ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్పర్శ్‌ హాస్పిస్‌ నుంచి ఆహ్వానం వచ్చే వరకు పాలియేటివ్‌ కేర్‌ అంటే ఏంటో తెలియదని అన్నారు. పాలియేటివ్‌ కేర్‌ గురించి స్వయంగా తెలుసుకుంటే గొప్పగా అనిపించిందని తెలిపారు. ఐదేండ్లలోనే స్పర్శ్‌ హాస్పిస్‌కు మంచి భవనం రావడం సంతోషకరమని పేర్కొన్నారు.

చదవండి: బతికుండగానే చంపేశారు..

రోటరీ క్లబ్‌ చేసే ఆరోగ్య కార్యక్రమాలకు ప్రభుత్వం తరపున సహకారం ఉంటుందన్నారు. స్పర్శ్‌ హాస్పిస్‌కు నీటి బిల్లు, విద్యుత్‌ బిల్లు, ఆస్తిపన్ను రద్దుచేస్తామని హామీ ఇచ్చారు. మహాకవి శ్రీశ్రీ అన్నట్లు స్వతంత్ర దేశంలో చావు కూడా పెళ్లిలాంటిదేనని పేర్కొన్నారు. ప్రభుత్వమే అన్ని చేయాలంటే కుదరదని, ప్రైవేటు సంస్థలతో కూడా ప్రభుత్వ భాగస్వామ్యం ఉంటుందని స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో వర్షం పడితే ట్రాఫిక్‌ ఉంటుందన్నారు. అయితే ట్రాఫిక్‌కు సంబంధించి మున్సిపల్‌ శాఖ మంత్రిగా అందరూ తననే ట్రోల్‌ చేస్తారని, కానీ హైదరాబాద్‌లో వర్షం పడితే ట్రాఫిక్‌ జామ్‌కు తానొక్కడినే బాధ్యుడిని కాదన్నారు.

చదవండి: మా పిన్ని ఓ లేడీ టైగర్‌.. రక్షించండి సార్‌

మరిన్ని వార్తలు