KTR: ఆక్రమణలపై ‘ట్రిపుల్‌ ఆర్‌’ అస్త్రం

5 Oct, 2021 08:31 IST|Sakshi

అసెంబ్లీలో పురపాలక, పట్టణాభివృద్ధి శాఖల మంత్రి కేటీఆర్‌

సాక్షి, హైదరాబాద్‌: గ్రేటర్‌ చెరువుల ఆక్రమణలపై రాష్ట్ర ప్రభుత్వం ‘ట్రిపుల్‌ ఆర్‌’ అస్త్రం ప్రయోగించనుంది. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని 185 చెరువుల పరిరక్షణ, అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నట్లు రాష్ట్ర ఐటీ, పురపాలక, పట్టణా భివృద్ధి శాఖల మంత్రి కె.తారకరామారావు వెల్లడిం చారు. శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యు లు మాధవరం కృష్ణారావు, ప్రకాశ్‌గౌడ్, అక్బరుద్దీన్‌ తదితరులు లేవనెత్తిన అంశాలకు మంత్రి వివరణ ఇచ్చారు. గ్రేటర్‌ పరిధిలోని చెరువులు దశాబ్దాలుగా కబ్జాలకు గురవడంతో అవి కుంచించుకుపోయా యని పేర్కొన్నారు.

ప్రస్తుతం ఉన్నవాటిని పరిరక్షిస్తామని, తర్వాత ఆక్రమణలు తొలగించి సుందరీ కరిస్తామని మంత్రి తెలిపారు. చెరువుల పరిరక్షణలో భాగంగా ట్రిపుల్‌ ‘ఆర్‌’ విధానాన్ని అమలు చేస్తామని, ఆక్రమణల తొలగింపు(రిమూవ్‌), పున రావాసం(రిహాబిలిటేషన్‌), తిరిగి ఆక్రమణ కాకుండా నిలిపివేయడం(రిటైన్‌) పద్ధతిలో కార్యాచరణ రూపొందిస్తున్నామని తెలిపారు.

ప్రతి చెరువు పరిరక్షణకు మాస్టర్‌ ప్లాన్‌
నగరంలోని ప్రతి చెరువుకూ ప్రత్యేకంగా మాస్టర్‌ ప్లాన్‌ తయారు చేస్తామని, ప్రత్యేక కమిషనర్‌ ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తారని కేటీఆర్‌ పేర్కొ న్నారు. చెరువుల సుందరీకరణలో భాగంగా మురు గునీటి శుద్ధీకరణ కోసం 31 ఎస్‌టీపీలు రెండేళ్లలో నిర్మిస్తామని, వీటిని ఎఫ్టీఎల్‌ బయట ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఇప్పటికే జీహెచ్‌ఎంసీ పరిధి లోని 127 చెరువుల అభివృద్ధికి ప్రణాళికలు తయా రు చేశామని, ఇందులో 48 చెరువుల అభివృద్ధి దాదాపు పూర్తయిందని వెల్లడించారు. చెరువుల అభివృద్ధి, సుందరీకరణ కోసం రూ.407.30 కోట్లు మంజూరు కాగా, వీటిలో రూ.218 కోట్లు ఖర్చు చేశామని పేర్కొన్నారు. 

మరిన్ని వార్తలు