తేలని పంచాయితీ.. ధాన్యం కొనుగోళ్లపై స్పష్టత ఇవ్వని కేంద్రం

24 Nov, 2021 01:44 IST|Sakshi

నిర్ధిష్ట ప్రకటన కోసం రాష్ట్ర మంత్రుల వినతి

వార్షికంగా 1.50 కోట్ల మెట్రిక్‌ టన్నుల సేకరణకు పట్టు

వ్యవసాయ మంత్రితో చర్చించాక  26న చెబుతామన్న పీయూష్‌ గోయల్‌

సీజన్‌లో కొంత అధికంగా బియ్యం సేకరణకు సానుకూలం

బాయిల్డ్‌ రైస్‌ మాత్రం గింజ కూడా కొనేది లేదని స్పష్టీకరణ

ఆ మేరకు ప్రకటన చేయాలన్న కేటీఆర్‌ నేతృత్వంలోని బృందం

వ్యవసాయ మంత్రి తోమర్‌తో మర్యాదపూర్వక భేటీ    

సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో పండే వరి ధాన్యం కొను గోళ్లపై కేంద్రం ప్రభుత్వం ఎటూ తేల్చలేదు. దీనిపై స్పష్టమైన ప్రకటన చేయాలన్న తెలంగాణ ప్రజా ప్రతినిధుల వినతిపై ఎలాంటి నిర్ణయాన్ని ప్రకటిం చలేదు. ఏటా కనీసంగా 1.50 కోట్ల మెట్రిక్‌ టన్నుల మేర ధాన్యాన్ని కొనాలని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ నేతృత్వంలోని బృందం.. కేంద్ర ప్రజా పంపిణీ, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి పీయుష్‌ గోయల్‌ను కోరింది.

అయితే వ్యవసాయ శాఖ మంత్రితో చర్చించాక ఈ నెల 26న ఎంతమేర ధాన్యం సేకరణ చేస్తామన్న దానిపై స్పష్టత ఇస్తామని గోయల్‌ చెప్పారు. అంతవరకు వేచి ఉండాలని సూచించారు. రాష్ట్రం కోరినంతగా ప్రస్తుత పరిస్థితుల్లో ఏమాత్రం సేక రణ కుదరదని చెప్పకనే చెప్పిన కేంద్రమంత్రి, ప్రస్తుత వానాకాలా నికి సంబంధించి మాత్రం.. గతంలో ప్రకటించిన దానికన్నా కొంతమేర ఎక్కువ తీసుకునేందుకు సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. 

మూడున్నర గంటలు ఆలస్యంగా భేటీ..
ధాన్యం కొనుగోళ్లపై కేంద్రంతో చర్చలు జరిపేం దుకు ఆదివారం ఢిల్లీకి వచ్చిన మంత్రులకు సోమ వారం రాత్రే అపాయింట్‌మెంట్‌ ఇస్తామని తొలుత చెప్పినా కుదరలేదు. మంగళవారం మధ్యాహ్నం మూడు గంటల తర్వాత అపాయింట్‌మెంట్‌ ఇస్తా మని సమాచారమిచ్చారు. దీంతో కేటీఆర్‌ నేతృ త్వంలో మంత్రులు నిరంజన్‌రెడ్డి, గంగుల కమలా కర్, రాజ్యసభ, లోక్‌సభా పక్ష నేతలు కె.కేశవరావు, నామా నాగేశ్వర్‌రావు, ఎంపీలు కేఆర్‌ సురేశ్‌రెడ్డి, కొత్త ప్రభాకర్‌రెడ్డి, బీబీ పాటిల్, కవిత, ఎంఎస్‌ఎన్‌ రెడ్డి, దయాకర్, రంజిత్‌రెడ్డితో పాటు సీఎస్‌ సోమేశ్‌కుమార్, ఆర్ధిక శాఖ స్పెషల్‌ సీఎస్‌ రామ కృష్ణారావు, పౌర సరఫరాల కమిషనర్‌ అనిల్‌ కుమార్‌లు మూడు గంటలకే కృషి భవన్‌కు చేరు కున్నారు.

అయితే అమెరికా వర్తక సంఘం ప్రతి నిధులతో భేటీలో ఉన్న కారణంగా సుమారు మూడున్నర గంటల ఆలస్యంగా గోయల్‌ ఈ భేటీకి వచ్చారు. అప్పటివరకు కేంద్ర అధికారులతో చర్చి ంచిన మంత్రులు, కేంద్ర మంత్రి వచ్చాక ఆయనతో గంటా పది నిమిషాల పాటు చర్చలు జరిపారు. ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి పెట్టండి: రాష్ట్రంలో ప్రస్తుత పంటల సాగును మంత్రులు కేటీఆర్, నిరం జన్‌రెడ్డి, గంగుల కమలాకర్‌ ఆయ నకు వివరిం చారు. రాష్ట్రవ్యాప్తంగా నీటి లభ్యత పెరగడం, రైతు బంధు, నిరంతర విద్యుత్తు కార ణంగా వరి ధాన్యం సాగు గణనీయంగా పెరిగిందని, వ్యవసాయ అధి కారులతో క్షేత్రస్థాయిలో పంటల సాగుపై చేపట్టిన అవగాహనా కార్యక్రమాలతో భారీగా ధాన్యం దిగుబడులు వచ్చాయని వివరిం చారు.

ఈ ఒక్క వానాకాలంలోనే 1.50 కోట్ల మెట్రిక్‌ టన్నుల మేర ధాన్యం ఉత్పత్తి జరిగిందని వివరిం చారు. ఇం దులో స్థానిక, గృహ, విత్తనావసరాలు పోగా కోటి టన్నుల ధాన్యం సేకరణ అవసరం ఉంటుందని వివరించారు. కేంద్రం కేవలం 60 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం (40 లక్షల టన్నుల బియ్యం) మాత్రమే కొంటామంటే కుదరదని, దీనిద్వారా రాష్ట్ర ప్రభుత్వంపై భారీగా ఆర్ధిక భారం పడటంతో పాటు, కొనుగోళ్లకు అనేక ఇక్కట్లు ఎదురవుతా యని వివరించారు. దీంతో పాటే యాసంగిలోనూ భారీగా వరి ధాన్యం దిగుబడులు వచ్చే అవకాశా లుంటాయని, ఈ దృష్ట్యా ఏటా కనీసంగా 1.50 కోట్ల మెట్రిక్‌ టన్నుల ధాన్యం (సుమారు కోటి టన్నుల బియ్యం) కేంద్రం కొను గోలు చేయాలని కోరారు. అయితే దీనిపై కేంద్ర మంత్రి అంత సాను కూలంగా స్పందించ లేదని తెలుస్తోంది.

మరోవైపు కేంద్రం వద్ద నాలుగేళ్లకు సరిపడా ఉప్పుడు బియ్యం (బాయిల్డ్‌ రైస్‌) నిల్వలు న్నందున బాయిల్డ్‌ రైస్‌ అన్న అంశాన్నే మర్చిపో వాలని సూచించినట్లుగా చెబుతున్నారు. ఒక్క గింజ కూడా బాయిల్డ్‌ రైస్‌ కొనే పరిస్థితి లేదని, దీన్ని అర్థం చేసుకొని రాష్ట్రం ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి పెట్టాలని సూచించారు. దీనిపై రాష్ట్ర మంత్రులు స్పందిస్తూ, ఇకపై బాయిల్డ్‌ రైస్‌ కొనేది లేదని కేంద్ర ప్రభుత్వం ఓ ప్రకటన చేయాలని, ఇదే విషయాన్ని ప్రజలకు తెలియజెప్పి, ప్రత్యామ్నాయ పంటల సాగుపై అవగాహన కల్పిస్తామని సూచించారు.

ప్రత్యామ్నాయ పంటల సాగు ఒకేసారి పెంచలేమని, క్రమబద్ధంగా వరి సాగును తగ్గిస్తూ, ఇతర పంటల సాగును పెం చాల్సి ఉంటుందని, దానికి అనుగుణంగా కేంద్ర నిర్ణయాలు ఉండాలని కోరారు. దీనిపై స్పందించిన కేంద్ర మంత్రి, కేంద్ర పరంగా కొనుగోలు చేసే బియ్యంపై వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్రసింగ్‌ తోమర్, అధికారులతో చర్చించాక 26న స్పష్టత ఇస్తామని తేల్చిచెప్పారు. 

26న మరోసారి భేటీ
ఈ వానాకాలంలో భారీ ధాన్యం దిగుబడుల దృష్ట్యా, 60 లక్షల మెట్రిక్‌ టన్నులకు మించి కొంత ఎక్కువ కొనుగోలు చేసే అంశాన్ని పరిశీలిస్తామని గోయల్‌ చెప్పినట్లు తెలిసింది. అనంతరం అదే బ్లాక్‌లో ఉన్న వ్యవసాయ శాఖ మంత్రి తోమర్‌ను పీయూష్‌ సహా రాష్ట్ర మంత్రులు మర్యాద పూర్వ కంగా కలిశారు. కాగా 26న స్పష్టత ఇస్తా మన్న నేపథ్యంలో ఆరోజు కేంద్ర మంత్రులతో మరోసారి రాష్ట్ర మంత్రులు సమావేశం కానున్నారు.

ధాన్యం కొనుగోళ్లపై ముందుగానే ప్రకటన
రాష్ట్రంలో 62 లక్షల 13 వేల ఎకరాల్లో వరి సాగు చేస్తున్నట్టు తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేస్తున్న నేపథ్యంలో, తెలంగాణలో వరి సాగు విస్తీర్ణాన్ని 58 లక్షల 66 వేల ఎకరాలుగా కేంద్ర ప్రభుత్వం ధ్రువీ కరించింది. కాగా వార్షిక ధాన్యం కొనుగోలు టార్గె ట్‌ను ముందస్తుగా ప్రకటించాలనే ముఖ్యమంత్రి కేసీఆర్‌ డిమాండ్‌కు కేంద్రం సానుకూలంగా స్పం దించింది. ఇది దేశ రైతాంగానికందరికీ వర్తింప జేయాల్సిన విలువైన సూచనగా కేంద్రం అభి ప్రాయపడింది. మంత్రివర్గ బృందంతో చర్చల సం దర్భంగా ఈ మేరకు సీఎం సూచనను కేంద్రం అభి నందించింది. ఇకపై వార్షిక వరిధాన్యం కొను గోలు వివరాలను ముందుగానే ప్రకటిస్తామని, రానున్న సంవత్సరం నుంచే ఈ నూతన విధానాన్ని అమల్లోకి తెస్తామని స్పష్టం చేసింది.

ముఖ్యమంత్రి అసహనం..
గోయల్‌తో చర్చించిన అంశాలు, ఆయన స్పం దన తదితర అంశాలపై మంత్రులు, ఎంపీలు తుగ్లక్‌రోడ్‌లో ఉన్న సీఎం కేసీఆర్‌కు వివరిం చారు. బాయిల్డ్‌ రైస్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ సేక రించేది లేదని చెప్పిన అంశాన్ని వివరిస్తూనే వార్షిక కొనుగోళ్ల అంశాన్ని ఎటూ తేల్చని విష యాన్ని కూడా ఆయన దృష్టికి తీసుకెళ్లారు. దీంతో కేసీఆర్‌ అసహనం వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. 26 వరకు వేచి చూద్దామని, అప్పుడు కేంద్రం ఇచ్చే స్పష్టత ఆధారంగా తదు పరి కార్యాచరణ ప్రకటిద్దామని ఆయన అన్నా రని సమాచారం. కేంద్రమంత్రితో భేటీపై టీఆర్‌ఎస్‌ నేతలెవరూ మీడియాతో మాట్లాడ లేదు. అంతకుముందు ముఖ్యమంత్రి కేసీఆర్‌ సహా మంత్రులు, ఎంపీలు కేఆర్‌ సురేశ్‌రెడ్డి ఇచ్చిన మధ్యాహ్న విందులో పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు