భారతీయుల దృష్టి మళ్లించేందుకే అగ్నిపథ్‌ తీసుకొచ్చారా..?: కేటీఆర్‌

20 Jun, 2022 12:08 IST|Sakshi

కేంద్రంలోని బీజేపీ సర్కార్‌ తీసుకువచ్చిన అగ్నిపథ్ స్కీమ్‌పై దేశవ్యాప్తంగా నిరసనలు వెలువెత్తుతున్నాయి. అగ్నిపథ్‌కు నిరసనగా సోమవారం రాజకీయ పార్టీలు భారత్‌ బంద్‌కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. 

తాజాగా.. అగ్నివీర్‌ల అంశంలో బీజేపీ నేతల వ్యాఖ్యలపై కేటీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. అగ్నిపథ్‌లో యువత డ్రైవర్లు, ఎలక్ట్రీషియన్లు, బార్బర్లుగా ఉపాధి పొందవచ్చని కేంద్ర మంత్రి అన్నారు.  అగ్నివీరులను సెక్యూరిటీ గార్డులుగా నియమిస్తారని మరో బీజేపీ నేత చెప్పారు. ప్రధాని మోదీని అర్థం చేసుకోలేదని మళ్లీ యువతను నిందిస్తున్నారా? భారతీయుల దృష్టి మళ్లించేందుకే అగ్నిపథ్‌ను తీసుకొచ్చారా.? శ్రీలంక ఆరోపణల నుంచి మోదీ-అదానీ అవినీతిపై ప్రజల దృష్టిని మరల్చడానికి ఒక ఉపాయమా..? అని ట్విట్టర్‌ వేదికగా ప్రశ్నల వర్షం కురిపించారు. 

ఇది కూడా చదవండి: సైన్యంలో చేరమని మిమ్మల్ని ఎవరు అడిగారు: మాజీ ఆర్మీ చీఫ్ ఫైర్‌

మరిన్ని వార్తలు