తెలంగాణకు బీజేపీ అన్యాయం చేస్తోంది: కేటీఆర్‌

4 Mar, 2021 20:08 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కాజీపేటలో రైల్వేకోచ్‌ ఫ్యాక్టరీ ఏర్పాటు అవసరం లేదని కేంద్ర రైల్వేశాఖ రాష్ట్రానికి ఇచ్చిన సమాదనంపై గురువారం మంత్రి కేటీఆర్‌ మండిపడ్డారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణకు అన్యాయం చేయడం బీజేపీకి అలవాటుగా మారిందని ధ్వజమెత్తారు. ఐటీఐఆర్‌ ప్రాజెక్ట్ మాదిరిగానే రైల్వేకోచ్‌ ప్రాజెక్ట్‌కు బీజేపీ మంగళం పాడుతుందన్నారు. రైల్వేకోచ్‌ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని పలుమార్లు కోరామని గుర్తుచేశారు.

150 ఎకరాలు సేకరించి కేంద్రానికి అప్పగించామన్నారు. రైల్వేకోచ్‌ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయకపోతే.. వరంగల్‌తోపాటు తెలంగాణ రాష్ట్రానికి తీవ్రనష్టం జరుగుతుందన్నారు. రైల్వేకోచ్‌ ఫ్యాక్టరీ తెలంగాణకు దక్కాల్సిన రాజ్యాంగబద్ధమైన హక్కు అని ఆన్నారు. రైల్వేకోచ్‌ ఫ్యాక్టరీ కోసం పార్లమెంట్‌లో కేంద్రాన్ని నిలదీస్తామని కేటీఆర్‌ పేర్కొన్నారు. 

చదవండి: బీజేపీ క్షమాపణలు చెప్పాలి: కేటీఆర్‌

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు