8 ఏళ్ల కిందటి ‘అచ్ఛేదిన్‌’ ఇవేనా..?: మోదీ ట్వీట్‌పై కేటీఆర్‌

17 May, 2022 09:25 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రధాని నరేంద్ర మోదీ ఎనిమిదేళ్ల క్రితం ప్రజలకు ఇచ్చిన ‘అచ్ఛేదిన్‌’ హామీని గుర్తు చేస్తూ మంత్రి కె. తారక రామారావు ట్విట్టర్‌ వేదికగా తనదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు విసిరారు. ‘ఇండియా గెలిచింది’ అని 2014 మే 16న ప్రధాని చేసిన ట్వీట్‌ను రీట్వీట్‌ చేస్తూ ఏయే రంగాల్లో మోదీ ప్రభుత్వం గెలుపు సాధించిందో ఐదు పాయింట్లను వివరించారు. అందులో వరుసగా.. ‘రూపాయి విలువ అత్యంత కనిష్టస్థాయి 77.80కి చేరింది. 45 ఏళ్లలో అత్యధిక నిరుద్యోగం నమోదైంది. 30 ఏళ్లలో అత్యంత దారుణమైన స్థితికి ద్రవ్యోల్బణం చేరుకుంది. ప్రపంచంలోనే అత్య«ధిక ఎల్‌పీజీ ధర. 42 ఏళ్లలో అధ్వాన్నమైన ఆర్థిక పరిస్థితి నెలకొంది’ అని ట్వీట్‌ చేస్తూ ‘వెల్‌డన్‌ సర్‌’ అని ముగించారు.   

మరిన్ని వార్తలు