గాంధీ స్ఫూర్తితో​ మా తాత నిజాంకు వ్యతిరేకంగా పోరాడారు: కేటీఆర్ 

3 Sep, 2022 15:24 IST|Sakshi

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అనగానే.. తెలంగాణ కోసం పోరాటం చేసిన వ్యక్తి అని చెప్పుకుంటారు. అయితే, కేటీఆర్‌ తాజాగా తమ ఫ్యామిలీకి సంబంధించిన ఓ స్పెషల్‌ ఫొటోను ట్విట్టర్‌ వేదికగా పంచుకున్నారు. ఈ సందర్భంగా తమ ఫ్యామిలీలో కూడా గాంధీజీ బోధనలతో ఉత్తేజం పొంది తెలంగాణ తిరుగుబాటు ఉద్యమంలో నిజాంకు వ్యతిరేకంగా పోరాడిన తన తాత గురించి చెప్పుకొచ్చారు. 

అయితే, తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ ట్విట్టర్‌ వేదికగా ఓ ఫొటోలను షేర్‌ చేశారు. ఈ సందర్భంగా ఆ ఫొటోలో ఉన్నది తన తాతయ్య (తల్లి తరఫు) జె.కేశవరావు అని వెల్లడించారు. ఆ ఫొటోలపై వివరణ ఇస్తూ.. తమ కుటుంబంలో ఆయన ఒక స్ఫూర్తిదాయక వ్యక్తి అని అన్నారు. గాంధీజీ బోధనలతో ఉత్తేజం పొంది తెలంగాణ తిరుగుబాటు ఉద్యమంలో 1940ల్లో నిజాంకు వ్యతిరేకంగా పోరాడారని తెలిపారు. భారత కేంద్ర ప్రభుత్వం సైతం ఆయనకు స్వాతంత్ర సమరయోధుడిగా గుర్తింపు ఇచ్చిందని చెప్పుకొచ్చారు.

ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న నాయ‌కులు ఎంత మంది స్వాతంత్ర్య ఉద్య‌మంలో పాలుపంచుకున్నార‌ని కేటీఆర్ ప్ర‌శ్నించారు. వారికి సంబంధం లేని విష‌యాల‌ను కూడా త‌మ‌దని చెప్పుకోవ‌డానికి ప్ర‌య‌త్నిస్తార‌ని కేటీఆర్ విమ‌ర్శించారు. ఇక, ఒక ఫొటోలో కేటీఆర్, కవిత, ఎంపీ సంతోష్‌ రావు ఎలా ఉన్నారో కూడా చూడవచ్చు.

మరిన్ని వార్తలు