ఆమె ప్రవర్తన భయపెట్టింది.. కామారెడ్డి కలెక్టర్‌కు మద్దతుగా కేటీఆర్‌..

3 Sep, 2022 09:18 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్‌కు టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, తెలంగాణ మంత్రి కేటీఆర్ బాసటగా నిలిచారు. శుక్రవారం కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్, కామారెడ్డి కలెక్టర్‌కు మధ్య జరిగిన సంభాషణలో కేటీఆర్ కలెక్టర్‌కు మద్దతుగా నిలిచారు. కామారెడ్డి జిల్లా కలెక్టర్‌తో కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ ప్రవర్తన తనను భయపెట్టిందన్నారు.

కష్టపడి పనిచేసే ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారులను ఈ రాజకీయ నాయకులు నిరుత్సాహపరుస్తున్నారని ఆరోపించారు. కలెక్టర్ జితేష్ వి పాటిల్, గౌరవప్రదమైన ప్రవర్తనకు అభినందనలు తెలిపారు. ఈ మేరకు మంత్రి కేటీఆర్ ట్వీట్‌ చేశారు.

కాగా శుక్రవారం బీర్కూర్‌ మండల కేంద్రంలోని ఓ రేషన్‌ దుకాణం వద్ద లబ్ధిదా రులతో కేంద్ర మంత్రి మాట్లాడారు. ఎన్ని కిలోల బియ్యం ఇస్తున్నారని అడిగి తెలుసుకున్నారు.  రేషన్‌ బియ్యం పథకంలో కేంద్రం వాటా ఎంత? రాష్ట్రం వాటా ఎంత? లబ్ధిదారుల వాటా ఎంత? అంటూ.. కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రశ్నించారు. కేంద్రమంత్రి వరుసగా వేసిన ప్రశ్నలతో కలెక్టర్‌ కాస్త తడబడ్డారు. దీంతో మంత్రి అసహనం వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వాలు అమలు చేస్తున్న పథకాలపై జిల్లా పాలనాధికారికి స్పష్టత లేకపోతే ఎలా? అని ప్రశ్నించారు. 
చదవండి: స్టేట్‌.. సెంటర్‌.. సెప్టెంబర్‌ 17.. తెలంగాణలో హైవోల్టేజీ పాలిటిక్స్‌

మరిన్ని వార్తలు