సీఎం కేసీఆర్‌కు వందనాలు : కేటీఆర్‌

15 Nov, 2020 10:44 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : శానసమండలిలో ఖాళీగా ఉన్న గవర్నర్‌ నామినేటెడ్‌ ఎమ్మెల్సీ స్థానానికి ప్రముఖ ప్రజాకవి, వాగ్గేయకారుడు గోరెటి వెంకన్న పేరును రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ ట్విటర్‌ వేదికగా గోరేటి వెంకన్నకు శుభాకాంక్షలులు తెలిపారు. ‘తన పాటలతో ప్రజలను చైతన్యపరిచిన పాలమూరు మట్టి పరిమళం, సాహితీ దిగ్గజం గోరెటి వెంకన్న ఎమ్మెల్సీగా ఎన్నికైన సందర్భంగా వారికి శుభాకాంక్షలు. రాష్ట్ర సాధన ఉద్యమంలో ముందున్న తెలంగాణ కళాకారులకు దక్కిన గౌరవం ఇది’ అని ట్వీట్‌ చేశాడు. అలాగే మరో ట్విట్‌లో ‘గుర్రం జాషువా, బోయి భీమన్న వంటి సాహితీ దిగ్గజాలు పూర్వం శాసనమండలి సభ్యులుగా సేవలందించారు. పాటకు పట్టం కట్టి, ప్రజాకవి గోరెటి వెంకన్న గారిని సమున్నత పదవితో సత్కరించిన సీఎం కేసీఆర్ గారికి వందనాలు’ అని అన్నారు. 
(చదవండి : గోరటి వెంకన్నకు అరుదైన గౌరవం )

కాగా, మండలి గవర్నర్‌ కోటాలో ఖాళీగా ఉన్న మూడు స్థానాలకు ప్రభుత్వం అభ్యర్థులను ఖరారు చేసింది. ప్రజాకవి, వాగ్గేయకారుడు గోటి వెంకన్న, మాజీ మంత్రి, రజక సంఘం జాతీయ నాయకుడు బస్వరాజు సారయ్య, వాసవి సేవాకేంద్రం ముఖ్య సలహాదారు, ఆర్యవైశ్య సంఘం నాయకుడు బొగ్గారపు దయానంద్‌ పేర్లను ఖరారు చేశారు. తెలంగాణ ఉద్యమంలో తమ ఆట పాటలతో ప్రజలను చైతన్యవంతుల్ని చేసినందుకు గోరేటి వెంకన్నకు  అరుదైన గౌరవం కల్పించింది. పల్లె కన్నీరు పెడుతోందో.. అని తెలంగాణ ప్రజాజీవితాన్ని ప్రపంచానికి చాటిన జానపద కవి, గాయకుడు గోరటి వెంకన్న. తెలంగాణ భాష, యాసను ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రత్యేక ఉద్యమ ఆకాంక్షను మరింత బలోపేతం చేశారు.
(చదవండి : ‘గవర్నర్‌ కోటా’ ఖరారు)

మరిన్ని వార్తలు