బావ.. నువ్వు త్వ‌ర‌గా కోలుకోవాలి: కేటీఆర్‌

5 Sep, 2020 15:00 IST|Sakshi

సాక్షి, హైద‌రాబాద్ : తెలంగాణ ఆర్థిక‌శాఖ మంత్రి హ‌రీష్‌‌ రావుకు కరోనా వైర‌స్ సోకిన విష‌యం తెలిసిందే. ఈ విష‌యాన్ని ఆయ‌నే స్వ‌యంగా శ‌నివారం ఉద‌యం ట్విట‌ర్ ద్వారా వెల్ల‌డించారు. ఇక హ‌రీష్‌‌ రావుకు క‌రోనా అని తెలియడంతో త్వ‌ర‌గా కోలుకోవాల‌ని టీఆర్ఎస్ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు కోరుకుంటున్నారు.పలు జాగ్ర‌త్తలు తీసుకుంటూ హ‌రీష్‌రావు త్వ‌ర‌గా కోలుకోవాల‌ని  సూచిస్తున్నారు. ఈ క్రమంలో టీఆర్ఎ‌‌స్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌, ఐటీ మంత్రి కేటీఆర్ ట్విట్ట‌ర్ వేదిక‌గా స్పందించారు. ‘గెట్ వెల్ సూన్ బావ’ అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. కోవిడ్ నుంచి హ‌రీష్‌రావు త్వ‌ర‌గా కోలుకోవాల‌ని మంత్రి కేటీఆర్ ఆకాంక్షించారు. (మంత్రి హరీష్‌రావుకు కరోనా పాజిటివ్‌)

మ‌రోవైపు హ‌రీష్‌రావు క‌రోనా బారిన ప‌డంటంతో ఆయ‌న త్వ‌రగా కోలుకోవాల‌ని ఆరోగ్య‌శాఖ మంత్రి ఈటల రాజేంద‌ర్ పేర్కొన్నారు. ఈ మేరకు ట్విట‌ర్‌లో ‘ప్రజాప్రతినిధులుగా ప్రతి రోజు ప్రజల మధ్య ఉండే వారికి కరోనా వైరస్ సోకిన చాలా మంది విజయవంతంగా బయటపడుతున్నారు. అలాగే ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు కూడా త్వరగా కోలుకోవాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.’ అని ట్వీట్ చేశారు. హ‌రీష్‌రావు అభిమానులు కూడా పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. కాగా క‌రోనా వైర‌స్ వ‌ల్ల క‌లిగే ల‌క్ష‌ణాలు ఉండడంతో.. ప‌రీక్ష చేయించుకున్నాన‌ని, ఆ ప‌రీక్ష‌లో పాజిటివ్ రిపోర్ట్ వ‌చ్చిన‌ట్లు మంత్రి హ‌రీశ్ త‌న ట్వీట్‌లో తెలిపారు.  అయితే త‌న ఆరోగ్యం బాగానే ఉన్న‌ట్లు పేర్కొన్నారు. కొన్ని రోజుల నుంచి త‌న‌ను క‌లిసిన‌వారు క‌చ్చితంగా క‌రోనా ప‌రీక్ష చేయించ‌కోవాల‌ని మంత్రి త‌న ట్వీట్‌లో కోరారు.  త‌న‌తో కాంటాక్ట్ అయిన‌ ప్ర‌తి ఒక్క‌రూ ఐసోలేట్ కావాల‌ని, కోవిడ్ ప‌రీక్ష చేయించుకోవాల‌ని మంత్రి హ‌రీశ్ అభ్య‌ర్థించారు.  

మరిన్ని వార్తలు