వీడియో క్లిప్పింగ్‌ చూపిస్తే పోటీ నుంచి తప్పుకుంటా

16 Nov, 2023 08:45 IST|Sakshi

నల్గొండ: తన తండ్రి కుందూరు జానారెడ్డి బీఆర్‌ఎస్‌ కండువా కప్పుకుంటా అన్న వీడియో క్లిప్పింగ్‌ చూపిస్తే ఎన్నికల బరి నుంచి తప్పుకుంటానని కాంగ్రెస్‌ పార్టీ నాగార్జునసాగర్‌ అభ్యర్థి కుందూరు జైవీర్‌రెడ్డి సీఎం కేసీఆర్, బీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థి నోముల భగత్‌కు సవాల్‌ విసిరారు.  బుధవారం నిడమనూరు మండలంలోని పలు గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించి మాట్లాడారు.

కేసీఆర్, బీఆర్‌ఎస్‌ అభ్యర్థి హాలియా సభలో చెప్పింది నిజమైతే వీడియో క్లిప్పింగ్‌ చూపించాలన్నారు. ఉచిత విద్యుత్‌ నాలుగేళ్లు ఇస్తే బీఆర్‌ఎస్‌ కండువా కప్పుకుంటానని నాడు ప్రతిపక్ష నేత కుందూరు జానారెడ్డి అన్నారని సీఎం కేసీఆర్‌ మంగళవారం హాలియా ప్రజా ఆశీర్వాద సభలో వ్యాఖ్యానించడంపై జైవీర్‌రెడ్డి స్పందించారు.

కార్యక్రమంలో జెడ్పీటీసీ నందికొండ రామేశ్వరి, మాజీ ఎంపీపీ యడవెల్లి రంగశాయిరెడ్డి, అంకతి సత్యం, కొండా శ్రీనివాసరెడ్డి, శివమారయ్య, నూకల వెంకట్‌రెడ్డి, అంకతి వెంకటరమణ, బొల్లం శ్రీనివాస్‌ యాదవ్, ప్రభాకరరెడ్డి, వల్లబరెడ్డి, వివేక్‌ కృష్ణ, మేరెడ్డి వెంకటరెడ్డి, శ్రీను తదితరులు పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు