ఆత్మహత్యకు యత్నించిన ఆలయ స్థలదాత
ఇల్లెందు: గుడి నిర్మాణానికి స్థలం ఇచ్చిన తమను ఆలయంలోకి అనుమతించడం లేదని ఆరోపిస్తూ ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందుకు చెందిన చోటాలాల్ పాసీ కొన్నేళ్ల కిందట సాయిబాబా ఆలయ నిర్మాణానికి స్థలం ఇచ్చాడు.
అయితే, ఆయన కుమారుడు మోహన్‌లాల్ పాసీని కొంత కాలంగా గుడిలోకి కమిటీ సభ్యులు రానివ్వడం లేదని చెబుతున్నారు. పందులు కాస్తూ జీవిస్తున్నారనే అభియోగంతో అడ్డుకోవడమే కాక గుడి సమీప స్థలాన్ని కూడా స్వాదీనం చేసుకున్నారని ఆరోపిస్తూ మోహన్ ఆదివారం పురుగుల మందు తాగాడు.
కాగా, ఆలయంలోకి రానివ్వని అంశంపై పోలీసులు, కోర్టు దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. ఈవిషయమై ఆలయ కమిటీ అధ్యక్షుడు మల్లికార్జున్‌ను వివరణ కోరగా.. మోహన్‌లాల్ ఆరోపణలు అవాస్తవమని, ఏనాడు కూడా ఏమీ అనలేదన్నారు.