మా భూమి ఇప్పించండి సారూ.. 

20 Jul, 2021 09:40 IST|Sakshi

సాక్షి, జెడ్పీసెంటర్‌ (మహబూబ్‌నగర్‌): ‘మా తాత బూరెడ్డిపల్లి నాగయ్య పేరుపై ఉన్న భూమిని మాకు ఇప్పించండి..’ అని ఎనుగొండకు చెందిన యాదయ్య కోరారు. ఈ మేరకు సోమవారం కలెక్టర్‌ వెంకట్రావ్‌కు వినతి పత్రం సమర్పించారు. తమ భూమిని ఇప్పించాలని ప్లకార్డులను ప్రదర్శిస్తు కార్యాలయం ఆవరణలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా కేంద్రంలోని ఎనుగొండలోని 92 సర్వే నెంబర్‌లో మా తాతకు 2 ఎకరాల భూమి ఉందని, ఆ భూమిని మాకు తెలియకుండా ఎనుగొండకు చెందిన ఓ వ్యక్తి అక్రమంగా తమకు చెందిన భూమిని పట్టా చేసుకున్నారని ఆరోపించారు.

ఈ విషయంపై అధికారులకు ఫిర్యాదు చేస్తే విచారణ చేసి అర్డర్‌ ఇవ్వాలని జిల్లా ఉన్నతాధికారులు ఆదేశించినట్లు తెలిపారు. విచారణ చేయకుండా అధికారులు  వత్తాసు పలుకుతున్నారని ఆరోపించారు. వెంటనే విచారణచేసి  భూమి   ఇప్పించాలని కోరారు.   జిల్లా కేంద్రంలోని వీరన్నపేట సక్కనిరాయిలో ప్రభుత్వం నిర్మించిన డబుల్‌ బెడ్రూం ఇళ్ల సముదాయంలో సెల్‌ టవర్‌ను ఏర్పాటు చేసే చర్యలు తీసుకోవాలని మున్సిపల్‌ కోఆప్షన్‌సభ్యురాలు జ్యోతిశివరాజు కోరారు. ఈ మేరకు సోమవారం కలెక్టర్‌ వెంకట్రావ్‌కు వినతిపత్రం సమర్పించారు.   

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు