Ujjaini Mahankali Bonalu: జంటనగర వాహనదారులకు అలర్ట్‌.. ఆ రూట్లలో వెళ్లొద్దు

16 Jul, 2022 13:18 IST|Sakshi

బోనాల జాతర నేపథ్యంలో.. 17, 18వ తేదీల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు

8 ప్రాంతాల్లో వాహనాల పార్కింగ్‌కు ఏర్పాట్లు

నగర పోలీస్‌ కమిషనర్‌ సీవీ ఆనంద్‌ 

సాక్షి, హైదరాబాద్‌: సికింద్రాబాద్‌ ఉజ్జయినీ మహంకాళి బోనాల జాతర కారణంగా ట్రాఫిక్‌ ఇబ్బందులు తలెత్తకుండా నగర పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. అందులో భాగంగా ఈ నెల 17, 18వ తేదీల్లో నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. ఈ మేరకు నగర పోలీస్‌ కమిషనర్‌ సీవీ ఆనంద్‌ ఒక ప్రకటన విడుదల చేశారు.  

ట్రాఫిక్‌ మళ్లింపులు ఇలా... 
కర్బల మైదాన్‌ వైపు నుంచి వచ్చే ఆర్టీసీ బస్సులు రాణిగంజ్‌ చౌరస్తా నుంచి మినిష్టర్‌ రోడ్‌ మీదుగా, ఎస్పీ రోడ్‌లోని బేగంపేట హెచ్‌పీఎస్‌ వద్ద యూటర్న్‌ తీసుకుని సీటీవో, వైఎంసీఏ, సెయింట్‌ జాన్సన్‌ రోటరీ, సంగీత్, గోపాలపురం ట్రాఫిక్‌ పోలీస్‌ స్టేషన్ల మీదుగా స్టేషన్‌కు చేరుకోవాలి.

► సికింద్రాబాద్‌ స్టేషన్‌ నుంచి ట్యాంక్‌బండ్‌ వైపు వెళ్లే ఆర్టీసీ బస్సులు చిలకలగూడ చౌరస్తా, గాంధీ ఆస్పత్రి, ముషీరాబాద్, కవాడిగూడ, మారియట్‌ హోటల్‌ మీదుగా ట్యాంక్‌బండ్‌ వైపు వెళ్లాలి.

► సికింద్రాబాద్‌ స్టేషన్‌ నుంచి తాడ్‌బంద్, బేగంపేట వెళ్లే ఆర్టీసీ బస్సులు క్లాక్‌ టవర్, ప్యాట్నీ చౌరస్తా లేదా క్లాక్‌ టవర్, వైఎంసీఏ మీదుగా వెళ్లాల్సి ఉంటుంది.

► బైబిల్‌ హౌస్‌ నుంచి సికింద్రాబాద్‌ స్టేషన్‌కు వెళ్లే సాధారణ ట్రాఫిక్‌ గాస్మండి చౌరస్తా, సజ్జన్‌లాల్‌ స్ట్రీట్, రాణిగంజ్‌ మీదుగా వెళ్లాలి.

► ప్యాట్నీ ఎస్‌బీఐ చౌరస్తా నుంచి ట్యాంక్‌ బండ్‌ వెళ్లే సాధారణ ట్రాఫిక్‌ ప్యాట్నీ చౌరస్తా నుంచి మినిష్టర్‌ రోడ్, ప్యారడైజ్‌ లేదా క్లాక్‌ టవర్‌ సంగీత్‌ చౌరస్తా, సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ మీదుగా చిలకలగూడ వైపు నుంచి వెళ్లాలి.

► ప్యారడైజ్‌ వైపు నుంచి బైబిల్‌ హౌస్‌ వెళ్లాల్సిన వాహనదారులు ఎస్‌బీఐ, క్లాక్‌టవర్‌ మీదుగా వెళ్లాలి.

► క్లాక్‌ టవర్‌ నుంచి ఆర్పీరోడ్‌ వెళ్లే వాహనదారులు ప్యారడైజ్, మినిష్టర్‌ రోడ్‌ మీదుగా వెళ్లాల్సి ఉంటుంది.

► సీటీవో, ప్యారడైజ్‌ నుంచి ఎంజీరోడ్‌ వెళ్లే వాహనాలు సింధీకాలనీ, మినిష్టర్‌ రోడ్, కర్బల మైదాన్‌గా వెళ్లాలి.

► పంజగుట్ట వైపు నుంచి సికింద్రాబాద్‌ స్టేషన్‌ వైపు వెళ్లే వాహనదారులు ఖైరతాబాద్‌ జంక్షన్, ఐమాక్స్‌ రోటరీ, తెలుగు తల్లి ఫ్లై ఓవర్, లోయర్‌ ట్యాంక్‌బండ్, ఆర్టీసీ చౌరస్తా, ముషీరాబాద్, గాంధీ ఆస్పత్రి మీదుగా చేరుకోవాల్సి ఉంటుంది.

► సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ నుంచి ట్యాంక్‌ బండ్‌ వైపు వెళ్లే వాహనదారులు ఓల్డ్‌ గాంధీ, మోండా మార్కెట్, బైబిల్‌ హౌస్, కర్బల మైదాన్‌ మీదుగా వెళ్లాలి.

► ఉప్పల్‌ నుంచి పంజగుట్ట వెళ్లే వాహనదారులు రామంతాపూర్, అంబర్‌పేట్, హిమాయత్‌నగర్, ఖైరతాబాద్‌ రోడ్డును వినియోగించుకోవాలి.

► సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ నుంచి క్లాక్‌ టవర్‌ వైపు రెండు వైపుల రోడ్డు మూసి ఉంటుంది ఈ రోడ్డు వైపు రావద్దు.

► మహంకాళి ఆలయానికి వెళ్లే టొబాకోబజార్, హిల్‌స్ట్రీట్, సుభాష్‌రోడ్‌లో బాటా నుంచి రాంగోపాల్‌పేట్‌ పాత పోలీస్‌ స్టేషన్‌ వరకు, ఆదయ్యనగర్‌ నుంచి దేవాలయం వైపు వెళ్లే వాహనాల రాకపోకలను నిషేధించారు.  

వాహనాల పార్కింగ్‌ ప్రదేశాలు ఇవే... 
► బోనాల జాతరకు వచ్చే వాహనదారుల కోసం ట్రాఫిక్‌ పోలీసులు 8 ప్రాంతాల్లో పార్కింగ్‌లను ఏర్పాటు చేశారు.

► సెయింట్‌ జాన్సన్‌ రోటరీ, స్వీకార్‌ ఉపకార్, ఎస్‌బీఐ వైపు నుంచి వచ్చే వాహనాలు హరిహర కళా భవన్‌తో పాటు బెల్సన్‌ తాజ్‌ హోటల్, మహబూబ్‌ కళాశాల, ఎస్వీఐటీలో పార్కింగ్‌ చేసుకోవచ్చు.

► సుభాష్‌రోడ్, రైల్వే స్టేషన్‌ వైపు నుంచి వచ్చే వాహనాలు ఓల్డ్‌ జైల్‌ఖానా వద్ద, కర్బల మైదాన్, బైబిల్‌ హౌస్, గాస్మండి వైపు నుంచి వచ్చే వాహనాలు ఇస్లామియా స్కూల్, రాణిగంజ్, ఆదయ్యనగర్‌ చౌరస్తా నుంచి వచ్చే వాహనాలు ఆదయ్య మెమోరియల్‌ స్కూల్‌లో, సీటీవో, బాలంరాయి, రసూల్‌పురా నుంచి వచ్చే వాహనాలు గాంధీ విగ్రహం వద్ద, మంజు థియేటర్‌ వైపు వచ్చే వాహనాలు అంజలి థియేటర్‌ వద్ద పార్కింగ్‌ చేసికోవచ్చు.

► ‘సికింద్రాబాద్‌ స్టేషన్‌కు వచ్చే ప్రయాణికులు 10వ నంబర్‌ ప్లాట్‌ఫాం వైపు ఉన్న రహదారిని ఉపయోగించుకోవాలి’ అని నగర పోలీస్‌ కమిషనర్‌ సీవీ ఆనంద్‌ సూచించారు. (క్లిక్‌:  హైదరాబాద్‌ ఐఐటీ అదుర్స్‌)

మరిన్ని వార్తలు