నల్గొండ: ఒక్కరోజే 640 కరోనా కేసులు నమోదు

25 Aug, 2020 10:36 IST|Sakshi
రేపాల పీహెచ్‌సీలో పరీక్షలు నిర్వహిస్తున్న వైద్యులు

సాక్షి, నల్గొండ: ఉమ్మడి జిల్లాలో కరోనా ఉధృతి తగ్గడం లేదు. రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. దాంతో ప్రజలు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. సోమవారం ఒక్క రోజే 640 కేసులు నమోదయ్యాయి. దీంతో అధికారులు, నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నల్లగొండ జిల్లాలో మొత్తం 307... కట్టంగూర్‌లో 18 మందికి కరోనా సోకింది. చందంపేటలో ఇద్దరికి, నాగార్జునసాగర్‌లో 11 మందికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. వీరిలో పైలాన్‌కాలనీలో ఆరుగురికి, హిల్‌కాలనీ, రంగుండ్ల, నెల్లికల్లు, మాచర్ల, కుంకుడు చెట్టుతండాకు చెందిన ఒకొక్కరికి పాజిటివ్‌ వచ్చింది. చింతపల్లిలో ఒకరికి, కేతేపల్లి మండలంలోని ఇనుపాములలో ముగ్గురికి, కేతేపల్లి, చీకటిగూడెంలో ఇద్దరు చొప్పున, కొప్పోలులో ఒకరికి పాజిటివ్‌ వచ్చింది. మిర్యాలగూడ మండలంలో 26, పెద్దఅడిశర్లపల్లి మండలంలో ఐదు కేసులు నమోదయ్యాయి. వీరిలో నేనావత్‌తండాకు చెందిన ముగ్గురికి, గుడిపల్లి గ్రామానికి చెందిన ఒకరికి, మండల కేంద్రానికి చెందిన ఒకరికి నిర్ధారణ అయింది.

హాలియా పట్టణంలో ఎనిమిది మందికి, కొత్తపల్లిలో ఒకరికి, పాలెంలో మరొకరికి, పెద్దవూర మండలంలో తొమ్మిది మందికి కరోనా సోకింది. గుర్రంపోడు మండల కేంద్రానికి చెందిన 11 మందికి, చామలేడుకు చెందిన ఒకరికి, కొప్పోలులో ఇద్దరికి, వద్దిరెడ్డిగూడెంలో ఒకరికి, నల్లగొండకు చెందిన ఒకరికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. త్రిపురారంలో 6, పెద్దదేవులపల్లిలో 1 పాజిటవ్‌ కేసు నమోదయ్యాయి. దేవరకొండలో 18 మందికి, కొండమల్లేపల్లిలో 9 మందికి, దామరచర్ల మండలం వాడపల్లిలో 6, దామరచర్ల 2, గణేశ్‌పహాడ్‌లో 1, రాళ్లవాగుతండాలో 1 కేసు నమోదైంది. మునుగోడు మండల వ్యాప్తంగా 12 మందికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. నకిరేకల్‌ మండలంలో 53 మందికి కరోనా సోకింది. వీరిలో నోములలో 10 మంది, మర్రురులో ఒకరు, బాబాసాహెబ్‌గూడెంలో ఇద్దరు, నకిరేకల్‌లో 24 మంది, మరో 16 మంది ఇతర ప్రాంతాల వారు ఉన్నారు. అడవిదేవులపల్లి మండలంలో 17 మందికి కరోనా సోకింది.

వీరిలో అడవిదేవులపల్లి 10, వీర్లపాలెం 4, ముదిమాణిక్యం 2, చిట్యాల 1 నమోదయ్యాయి. మిర్యాలగూడ మండలం తక్కెళ్లపాడు గ్రామానికి చెందిన ఇద్దరికి పాజిటివ్‌ వచ్చింది. చిట్యాలలో 6, వెంబాయిలో 1, నేరడలో 1, పెద్దకాపర్తిలో 1 కేసు నమోదైంది. నాంపల్లిలో 2, పెద్దాపురంలో 3, పస్నూర్‌లో 1, నర్సింహులగూడెంలో 2, చామలపల్లిలో 1 కేసు నమోదైంది. నార్కట్‌పల్లి పట్టణంలో 11, నైబాయిలో 2, నెమామనిలో 4, ఎల్లారెడ్డిగూడెంలో 3, చెర్వుగట్టులో 2, నక్కలపల్లిలో 13, బాజకుంటలో 1, అమ్మనబోలులో 1, మాండ్రలో 1 పాజిటివ్‌ వచ్చింది. శాలిగౌరారం మండలంలోని చిత్తలూరు గ్రామంలో 21మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.  

యాదాద్రిభువనగిరి జిల్లాలో 138 ...
భువనగిరిలో 12 మందికి కరోనా సోకినట్లు డీఎంహెచ్‌ఓ డాక్టర్‌  సాంబశివరావు తెలిపారు. రామన్నపేట మండలంలో 13 కరోనా కేసులు నమోదయ్యాయి. వీరిలో రామన్నపేటకు చెందిన ఆరుగురు, సిరిపురానికి చెందిన ముగ్గురు, నిధానపల్లికి చెందిన ఇద్దరు, లక్ష్మాపురం, మునిపంపుల గ్రామాలకు చెందిన వారు ఒకొక్కరు ఉన్నారు. ఆలేరు మండల కేంద్రంలో నలుగురికి, కొలనుపాకకు చెందిన ఆరుగురు, పటేల్‌గూడెంకు చెందిన ఒకరికి, భూదాన్‌పోచంపల్లిలో నలుగురికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. వీరిలో పెద్దగూడెం, జలాల్‌పురం గ్రామాలకు చెందిన ఒకొక్కరికి, హైదరాబాద్‌లోని హయాత్‌నగర్‌కు చెందిన మరో ఇద్దరికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. చౌటుప్పల్‌లో 29 మందికి, ఆత్మకూరు(ఎం)మండలంలో తొమ్మిది మందికి, సింగారానికి చెందిన ఇద్దరికి కరోనా వచ్చింది. యాదగిరిగుట్ట పట్టణంతో పాటు మండల వ్యాప్తంగా ఐదు కరోనా కేసులు నమోదయ్యాయి.

వీరిలో గౌరాయపల్లిలో ఒకరికి, బాహుపేటలో ఒకరికి, యాదగిరిపల్లిలో ఇద్దరికి, గుండ్లపల్లిలో ఒకరికి కరోనా సోకింది.  మోత్కూరులో ముగ్గురికి, దాచారంలో ఓ గర్భిణితో పాటు మరో వ్యక్తికి, దత్తప్పగూడెంలో ఒకరికి కరోనా వచ్చింది. వలిగొండ మండలంలో 11 మందికి కరోనా సోకింది. వీరిలో వలిగొండలో నలుగురికి, నాతాళ్లగూడెంలో ఇద్దరికి, గంగాపురంలో ఇద్దరికి, లక్ష్మపురంలో ఒకరికి, అరూర్‌ లో ఒకరికి, మసీదుగూడెంకు చెందిన ఒకరికి కరోనా సోకింది. గుండాల మండలంలోని రామారం గ్రామంలో ఐదు కరోనా కేసులు నమోదయ్యాయి. రాజాపేట మండల పరిధిలోని రాజాపేట లో 2, రేణికుటంలో 1, జాలలో 1, రఘునాథపురంలో 1 కేసు నమోదైంది. మోటకొండూర్‌లో ఐదుగురికి, కదిరేణిగూడెంలో ఒకరికి, ఆరోగ్య కేంద్రం సిబ్బంది ఒకరికి కరోనా సోకింది. బొమ్మలరామారం మండలం మల్యాల, తిమ్మాపూర్‌ గ్రామాలకు చెందిన ఒకొక్కరికి కరోనా సోకింది. సంస్థాన్‌ నారాయణపురం మండల పరిధిలో ఆరుగురికి కరోనా సోకింది. అడ్డగూడూరులో 8 మందికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. తుర్కపల్లి మండల పరిధిలో ముగ్గురికి కరోనా సోకింది.  

సూర్యాపేట జిల్లాలో 195 ...
సూర్యాపేటలోని జమ్మిగడ్డ విద్యుత్‌ కార్యాలయంలో ముగ్గురికి కరోనా వచ్చింది. మునగాల మండల పరి«ధిలో 14 మందికి, అర్వపల్లి మండల పరిధిలో ఆరుగురికి, చిలుకూరు మండలంలో ముగ్గురికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. గరిడేపల్లి మండలంలో 13 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. అనంతగిరి మండలంలో 19 మందికి, నడిగూడెం మండలంలో 10 మందికి కరోనా సోకింది. హుజూర్‌నగర్‌లో 11 మందికి, చింతలపాలెం మండలంలోని వజినేపల్లిలో ఒకరికి, చివ్వెంల మండలం కుడకుడలో 4, బీబీగూడెంలో 1, బి.చందుపట్లలో 1, గుంపులలో 1 నమోదైంది.   తిరుమలగిరి మండలంలో 11 మందికి, నేరేడుచర్ల పట్టణంలో 10 మందికి, మేడారంలో ఒకరికి, దిర్శించర్లలో ముగ్గురికి కరోనా సోకింది. నాగారం మండల పరిధిలోని ఈటూరుకు చెందిన వ్యక్తికి, ఆత్మకూర్‌ (ఎస్‌) మండలంలో 35 మందికి, తుంగతుర్తి మండలంలో 17 మందికి కరోనా వచ్చింది. మేళ్లచెరువు మండలంలోని మైహోం సిమెంట్‌ పరిశ్రమలో 16 మందికి, రామాపురంలో ఒకరికి, రేవూరులో ఒకరికి, మేళ్లచెరువులో ఒకరికి, మోతె మండలంలో 11 మందికి కరోనా సోకింది. వీరిలో మోతె 2, నర్సింహాపురం ఒకరు, రావిపహాడ్‌లో 3, రావికుంటతండాలో 1, బుర్కచర్లలో 1, నామవరంలో 3 కరోనా కేసులు నమోదయ్యాయి. 

మరిన్ని వార్తలు