Hyderabad Traffic Problems: నగరవాసులకు శుభవార్త.. ఇక వారికి ట్రాఫిక్‌ చిక్కులు లేనట్లే.. ఫిబ్రవరిలోనే అందుబాటులోకి

31 Jan, 2022 20:25 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఎస్సార్‌డీపీలో భాగంగా జీహెచ్‌ఎంసీ చేపట్టిన మరో అండర్‌పాస్‌ వచ్చే ఫిబ్రవరిలో అందుబాటులోకి రానుంది. ఎల్‌బీనగర్‌ జంక్షన్‌ వద్ద కుడివైపు అండర్‌పాస్‌ పనులు దాదాపు పూర్తయ్యాయి. తుది మెరుగులుదిద్ది, ఫిబ్రవరిలో వినియోగంలోకి తేనున్నట్లు జీహెచ్‌ఎంసీ అధికారులు పేర్కొన్నారు. ఇప్పటికే ఎడమవైపు అండర్‌పాస్‌ వినియోగంలో ఉండటం తెలిసిందే. ఈ అండర్‌పాస్‌ కూడా అందుబాటులోకి వస్తే ఇటు సికింద్రాబాద్‌ నుంచి శంషాబాద్‌ విమానాశ్రయం వైపు వెళ్లే వారికి, విమానాశ్రయం నుంచి ఆరాంఘర్, మిథానీల మీదుగా ఉప్పల్, నాగోల్, సికింద్రాబాద్‌ ప్రాంతాల వైపు వెళ్లేవారికి ట్రాఫిక్‌ చిక్కులు లేని సాఫీ ప్రయాణం సాధ్యం కానుంది. 

అండర్‌పాస్‌ వివరాలు.. 
► పొడవు: 490 మీటర్లు 
► వెడల్పు: 12. 87 మీటర్లు 
► మూడు లేన్లు.. ఒకవైపు ప్రయాణం 
► అంచనా వ్యయం : రూ.14.87 కోట్లు   

ఫిబ్రవరిలో అందుబాటులోకి.. తుకారాంగేట్‌ ఆర్‌యూబీ సైతం.. 
ఎల్‌బీనగర్‌ అండర్‌పాస్‌తో పాటు తుకారాం గేట్‌ రైల్వే అండర్‌పాస్‌ పనులు కూడా పూర్తి కావచ్చాయని, అది కూడా ఫిబ్రవరిలో  ప్రారంభించనున్నట్లు జీహెచ్‌ఎంసీ పేర్కొంది.

చదవండి: Hyderabad: రాయదుర్గంలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి ఆత్మహత్య

మరిన్ని వార్తలు