Telangana Congress: తెలంగాణ నుంచి 47 మందికి అవకాశం

21 Feb, 2023 04:03 IST|Sakshi

ఛత్తీస్‌గఢ్‌ రాజధాని రాయ్‌పూర్‌లో ఈనెల 24 నుంచి 26 వరకు జరగనున్న ఏఐసీసీ 85వ ప్లీనరీలో పాల్గొనేందుకు తెలంగాణ నుంచి 47 మంది నాయకులకు అవకాశం కల్పించారు. ఇందు లో 33 మంది ఎన్నికైన సభ్యులు కాగా, మిగతా 14 మంది కోఆప్టేడ్‌ సభ్యులు. ఏఐసీసీకి ఎన్నిౖకైన సభ్యు లుగా తెలంగాణ నుంచి పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, ఎంపీలు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎమ్మెల్యేలు శ్రీధర్‌బాబు, పొదెం వీరయ్య, సీతక్క, జగ్గారెడ్డి, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, ముఖ్య నేతలు జానారెడ్డి, షబ్బీర్‌ అలీ, వీహెచ్, పొన్నాల లక్ష్మయ్య ఉన్నారు. 

ఏఐసీసీ 85వ ప్లీనరీలో దామోదర రాజనర్సింహ, రేణుకాచౌదరి, బలరాం నాయక్, మధు యాష్కీగౌడ్, మహేశ్వర్‌రెడ్డి, చిన్నారెడ్డి, సంపత్‌ కుమార్, వంశీచంద్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, అంజన్‌కుమార్‌ యాదవ్, కొండా సురేఖ, మల్లు రవి, గీతారెడ్డి, కోదండరెడ్డి, ప్రేమ్‌సాగర్‌రా వు, అజారుద్దీన్, మహేశ్‌కుమార్‌ గౌడ్, సంజీవరెడ్డి, శివసేన రెడ్డి, బల్మూరు వెంకట్‌ ఉన్నారు.

కాగా, ఆర్‌.దామోదర్‌రెడ్డి, సుదర్శన్‌రెడ్డి, వేం నరేందర్‌రెడ్డి, విష్ణువర్ధన్‌రెడ్డి, సురేశ్‌ షెట్కార్, రమేశ్‌ ముదిరాజ్, హర్కర వేణుగోపాల్, కుసుమ కుమార్, నిరంజన్, టి.కుమార్‌రావు, బెల్లయ్యనాయక్, బూ స అనులేఖ, సునీతా రావు, కోట నీలిమలకు ఏఐసీసీ కో ఆపె్టడ్‌ సభ్యులుగా అవకాశం కలి్పంచారు. ప్లీనరీలో ఈ ఏడాది జరిగే పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో పాటు 2024 సార్వత్రిక ఎన్నికలకు దేశవ్యాప్తంగా బీజేపీని ఎదుర్కొనేందుకు పార్టీ ఎలా సిద్ధం కావాలన్న అంశంపై చర్చించనున్నారు. 24వ తేదీన జైరామ్‌ రమేశ్‌ నేతృత్వంలోని ముసాయిదా కమిటీ తయారుచేసిన తీర్మానాలను చర్చించి ఖరారు చేస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి.   

మరిన్ని వార్తలు