పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్న ఉప్పల్‌ ఎమ్మెల్యే

30 Jul, 2021 14:00 IST|Sakshi

సాక్షి, ఉప్పల్‌ (హైదరాబాద్‌): ఉప్పల్‌ ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డికి తృటిలో ప్రమాదం తప్పింది. గురువారం ఉప్పల్‌లోని శ్రీకర్‌ హెల్త్‌ కేర్‌ ఆస్పత్రి వార్షికోత్సవానికి ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి, బోడుప్పల్‌ మేయర్‌ సామల బుచ్చిరెడ్డి, మాజీ కార్పొరేటర్‌ మందముల్ల పరమేశ్వర్‌రెడ్డి హాజరయ్యారు. కార్యక్రమం అనంతరం ఆస్పత్రిలోని మొదటి అంతస్తుకు వెళ్లేందుకు  లిఫ్ట్‌ ఎక్కారు.

కొంతదూరం వెళ్లగానే లిఫ్ట్‌ ఉన్నట్లుండి పెద్ద శబ్ధం చేస్తూ కింద పడిపోయింది. దీంతో అప్రమత్తమైన సిబ్బంది, ఎమ్మెల్యే గన్‌మెన్‌లు లిఫ్ట్‌ గ్రిల్స్‌ను తెరిచి వారిని బయటకు తీసుకొచ్చారు. అందరూ సురక్షితంగా బయట పడటంతో ఊపిరి పీల్చుకున్నారు. ఆస్పత్రిలో అకస్మాత్తుగా జరిగిన ఘటనతో పేషెంట్లు, సహాయకులు ఆందోళనకు గురయ్యారు.  

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు