Special Trains: లింగంపల్లి–కాకినాడ, నాంపల్లి–జైపూర్‌ మధ్య ప్రత్యేక రైళ్లు

23 Jun, 2022 15:46 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రద్దీ నేపథ్యంలో లింగంపల్లి–కాకినాడ, హైదరాబాద్‌–జైపూర్‌ మధ్య అదనపు రైళ్లు నడుపుతున్నారు. లింగంపల్లి–కాకినాడ మధ్య (07296) జూలై 2 నుంచి అక్టోబరు 1 వరకు ప్రతి మంగళ, గురు, శనివారాల్లో.. కాకినాడ–లింగంపల్లి మధ్య జూలై 1 నుంచి సెప్టెంబరు 30 వరకు ప్రతి సోమ, బుధ, శుక్రవారాల్లో (07295).. హైదరాబాద్‌–జైపూర్‌ మధ్య జూలై 1 నుంచి ఆగస్టు 26 వరకు ప్రతి శుక్రవారం (07115).. జైపూర్‌–హైదరాబాద్‌ మధ్య జూలై 3 నుంచి ఆగస్టు 28 వరకు ప్రతి ఆదివారం (07116) ప్రత్యేక రైళ్లు నడుస్తాయి. కాకినాడ రైళ్లు లింగంపల్లిలో సాయంత్రం 6.25 గంటలకు బయల్దేరనుండగా, జైపూర్‌ రైళ్లు నాంపల్లిలో రాత్రి 8.20కి బయల్దేరుతాయి.  

డబ్లింగ్‌ పనులతో పలు రైళ్ల రద్దు..  
సెంట్రల్‌ రైల్వే పరిధిలోని మన్మాడ్‌ సెక్షన్‌లో డబ్లింగ్‌ పనులు జరుగుతున్న నేపథ్యంలో కొన్ని రైళ్లను రద్దు చేయగా, మరికొన్నింటిని పాక్షికంగా రద్దు చేశారు. జూన్‌ 23 నుంచి 28 వరకు ఈ రైళ్లకు అంతరాయం ఏర్పడనుంది. విశాఖ–షిర్డీ సాయినగర్‌ ఎక్స్‌ప్రెస్‌ 23 తిరుగుప్రయాణం కాగా, 24న రద్దు కానున్నాయి.

సీఎస్టీ ముంబై–జాల్నా ఎక్స్‌ప్రెస్‌ 25 నుంచి 28 వరకు, తిరుగుప్రయాణంలో 29 వరకు, ఆదిలాబాద్‌–ముంబై ఎక్స్‌ప్రెస్‌ 26 నుంచి 27 తేదీల్లో, తిరుగుప్రయాణంలో 27, 28 తేదీల్లో, కాజీపేట–దాదర్‌ 25, తిరుగుప్రయాణంలో మరుసటిరోజు, పుణే–కాజీపేట 24న, కాజీపేట–పుణే 26న రద్దయ్యాయి. 

కాకినాడ పోర్టు–సాయినగర్‌ షిర్డీ 25, 27లలో, తిరుగుప్రయాణంలో 26, 28లలో, సికింద్రాబాద్‌–షిర్డీ ఎక్స్‌ప్రెస్‌ 24, 26లలో తిరుగుప్రయాణంలో 25, 27లలో నాగర్‌సోల్‌–షిర్డీ మధ్య రద్దయ్యాయి. సికింద్రాబాద్‌–మన్మాడ్‌ ఎక్స్‌ప్రెస్‌ 24 నుంచి 27 వరకు, తిరుగుప్రయాణంలో 25 నుంచి 25 వరకు నాగర్‌సోల్‌–మన్మాడ్‌ మధ్య రద్దయ్యాయి. (క్లిక్‌: సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో విధ్వంసం.. తూటా రూట్‌ మారెన్‌)

మరిన్ని వార్తలు