హమ్మయ్యా.. గాంధీలో సిద్ధమైన ఆక్సిజన్‌ ఫ్లాంట్‌

7 May, 2021 08:11 IST|Sakshi

కరోనా బాధితులకు ఊరట

గాంధీ ఆస్పత్రిలో సిద్ధమైన ఆక్సిజన్‌ ఫ్లాంట్‌ 

మరో రెండు రోజుల్లో ప్రారంభం 

గాంధీ ఆస్పత్రి : కోవిడ్‌ నోడల్‌ సెంటరైన సికింద్రాబాద్‌ గాంధీ ఆస్పత్రిలో లిక్విడ్‌ ఆక్సిజన్‌ తయారీ ప్లాంట్‌ రెండు రోజుల్లో అందుబాటులోకి రానుంది. సుమారు రెండున్నర కోట్ల రూపాయల పీఎం కేర్‌ నిధులతో నిర్మించిన ఈ కేంద్రంలో నిమిషానికి వెయ్యి లీటర్ల లిక్విడ్‌ ఆక్సిజన్‌ తయారు చేసే రెండు యంత్రాలను సిద్ధం చేశారు. ఇటీవల కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఈ ప్లాంట్‌ను సందర్శించి నిర్మాణ పనులు త్వరితగతిన చేపట్టి అందుబాటులోకి తేవాలని ఆదేశించారు. అనంతరం జిల్లా కలెక్టర్‌ శ్వేతా మహంతి, డీఎంఈ రమేష్‌ రెడ్డిలు ఆక్సిజన్‌ తయారీ ప్లాంట్‌ను పరిశీలించి పనులను వేగవంతం చేశారు.

ఈ క్రమంలో గురువారం నిర్వహించిన ఆక్సిజన్‌ ప్లాంట్‌ రెడీ  ట్రయల్‌ రన్‌ విజయవంతం కావడంతో ఆక్సిజన్‌ ప్లాంట్‌ నిర్మాణం పూర్తయినట్లు సంబంధిత అధికారులు, కాంట్రాక్టరు ఆస్పత్రి పాలనా యంత్రాంగానికి తెలిపారు. శుక్ర, శనివారాల్లో ప్లాంట్‌ను అధికారికంగా ప్రారంభించేందుకు సన్నాహాలు  చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ప్లాంట్‌ తయారు చేసిన లిక్విడ్‌ ఆక్సిజన్‌ సమీపంలోని లైబ్రరీ భవనంలో నూతనంగా ఏర్పాటు చేసిన పడకలకు అనుసంధానం చేస్తున్నట్లు ఆస్పత్రి సూపరింటెండెంట్‌ రాజారావు తెలిపారు.   
(చదవండి: Telangana Police: వర్రీలో వారియర్స్‌)

మరిన్ని వార్తలు