ఫుల్లుగా తాగేశారు..

31 Dec, 2020 09:26 IST|Sakshi

రోజుకు రూ.కోట్లలో మద్యం వ్యాపారం

లాక్‌డౌన్‌ మినహా రికార్డు స్థాయిలో అమ్మకాలు

వైరా: ఏడాది కాలంలో మద్యంప్రియులు ఫుల్లుగా తాగేశారు. ఏటేటా మద్యం తాగేవారి సంఖ్య పెరిగిపోతుండటంతో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా వ్యాపారం ఊపందుకుంది. పదేళ్ల అమ్మకాలతో పోలిస్తే ఈ ఏడాది విపరీతంగా పెరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి. జనవరి నుంచి డిసెంబర్‌ 30వ తేదీ వరకు రూ.2,746కోట్ల వ్యాపారం జరిగింది. మద్యం దుకాణాల ద్వారా నెలకు రూ.150కోట్ల నుంచి రూ.180కోట్ల వరకు అమ్మకాలు జరిగాయి. ఈ ఏడాది మార్చి 22వ తేదీ నుంచి మే 5వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా కరోనా నేపథ్యంలో మద్యం దుకాణాలు బంద్‌ చేశారు. అయినప్పటికీ ఆ తర్వాత ఎన్నడూ లేనంతగా అమ్మకాలు జరగడం విశేషం.  ( ఇంట్లోనే ‘హ్యాపీ న్యూ ఇయర్‌’! )

ఓ వైపు ఆబ్కారీ శాఖ అధికారులు బెల్టుషాపుల ద్వారా మద్యం అమ్మకాలు చేపట్టకుండా చూస్తామని చెబుతున్నా.. గ్రామాల్లో మద్యం అమ్మకాలు యథేచ్ఛగా సాగాయి. ఏదేమైనా కరోనా కాలంలో కూడా మద్యంబాబులు తెగ తాగేశారని చెప్పొచ్చు. ఎన్నడూ లేని విధంగా మార్చి నెలలో రూ.985కోట్లకు పైగా అమ్మకాలు జరిగాయి. అతి తక్కువగా ఫిబ్రవరి నెలలో రూ.150 కోట్ల మద్యం అమ్మకాలు సాగాయి. మద్యం వ్యాపారం మూడు పువ్వులు.. ఆరు కాయలుగా సాగుతుండటంతో ప్రభుత్వానికి ఆదాయం కూడా అదే రీతిన వస్తోంది. గత ఏడాది ఉమ్మడి జిల్లావ్యాప్తంగా రూ.1,611కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి.  (న్యూ ఇయర్‌: పర్యటనకు వెళుతున్న బాలీవుడ్‌ జంటలు)

  

మరిన్ని వార్తలు