తెలంగాణ ఏర్పడ్డాక ఇదే అత్యధికం

3 Dec, 2020 08:52 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : నవంబర్‌ నెలలో మందుబాబులు ‘పండుగ’చేసుకున్నారు. ‘ఫుల్లు’గా ఏసేశారు. తెలంగాణ ఏర్పాటయ్యాక... ఎన్నడూ లేనంతగా నవంబర్‌లో మద్యం అమ్మకాలు జరిగాయి. రికార్డు స్థాయిలో రూ. 2,567 కోట్ల మద్యం అమ్ముడైంది. సాధారణంగా సగటున నెలకు రూ. 1,700 కోట్ల దాకా సేల్‌ ఉంటుంది. ఒక్కనెలలో ఇంత భారీమొత్తంలో మందు అమ్ముడుపోవడం ఇదే ప్రథమమని, ఇందుకు జీహెచ్‌ఎంసీ ఎన్నికలే కారణమని ఎక్సైజ్‌ అధికారులు చెపుతున్నారు.

31 లక్షల కేసులు... ఉఫ్‌! 
ఎన్నికల పుణ్యమా అని తాగినోళ్లకు తాగినంత దొరికింది. దాంతో మందుబాబులు గత నెలలో రెచ్చిపోయారని ఎౖMð్సజ్‌ గణాంకాలు చెపుతున్నాయి. నవంబర్‌ ఒకటి నుంచి 30వ తేదీ వరకు 31,60,135 లిక్కర్‌ కేసులు లాగించేశారు మద్యం ప్రియులు. ఇక బీర్ల విషయానికి వస్తే నవంబర్‌ నెలలో 23,85,597 బీర్‌ కేసులు మద్యం డిపోల నుంచి వైన్‌ షాపులకు చేరాయి. ఈ రెండింటి విలువ రూ. 2,567.14 కోట్లు కావడం గమనార్హం.

మూడు రోజుల్లో కుమ్మేశారు 
నవంబర్‌ అమ్మకాలను పరిశీలిస్తే జీహెచ్‌ఎంసీ ఎన్నికల జోష్‌లో ఎక్కువగా జరిగినట్టు అర్థమవుతోంది. నెల మొత్తంలో అమ్ముడయ్యే సరుకులో మూడోవంతు 26, 27, 28 తేదీల్లోనే డిపోల నుంచి మార్కెట్‌లోకి వచ్చింది. నవంబర్‌ నెలలో రూ.2,567 కోట్ల విలువైన మద్యం అమ్ముడయితే ఈ మూడు రోజుల్లో 860 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరిగాయి. ఇక, నెల ఆసాంతం 31 లక్షల లిక్కర్‌ కేసులను లాగించేసిన మందుబాబులు... ఇందులో 10.42 లక్షల కేసులను ఆ మూడు రోజుల్లోనే హుష్‌ పటాక్‌ అనిపించడం కొసమెరుపు.  

తేదీ      లిక్కర్‌ కేసులు   బీర్‌ కేసులు      విలువ రూ.కోట్లలో
26       2,74,779       1,74,501         229.26 
27      4,21,466       2,24,699          346.69 
28      3,46,247      1,65,475           284.48

మరిన్ని వార్తలు