లాక్‌డౌన్‌: జిల్లాల్లో పకడ్బందీగా..   

13 May, 2021 02:26 IST|Sakshi
తనిఖీ చేస్తున్న మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌

నిబంధనలు ఉల్లంఘించిన పలువురికి జరిమానా, కేసుల నమోదు 

కరీంనగర్‌లో డ్రోన్‌లతో నిఘా పెట్టిన పోలీసులు 

సాక్షి నెట్‌వర్క్‌:  రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో తొలి రోజు లాక్‌డౌన్‌ పకడ్బందీగా జరిగింది. ఉదయం ఆరు నుంచి పది గంటల వరకు అన్ని వ్యాపార, వాణిజ్య సంస్థలకు వెసులుబాటు ఇవ్వడంతో జనం రద్దీగా కనిపించింది. ఇతర ప్రాంతాలకు వెళ్లే వారి వాహనాలు, ఆర్టీసీ బస్సులు ఆ సమయంలోనే తిరిగాయి. బార్లు, వైన్‌షాపులు ఉదయం 6గంటలకే తెరిచారు. పది గంటల తర్వాత పోలీసులు ఎక్కడికక్కడ లాక్‌డౌన్‌ కఠినంగా అమలు చేశారు. టెస్టుల కోసం వెళ్లే జనం తగ్గడంతో ప్రభుత్వ ఆస్పత్రులు ఖాళీగా కనిపిం చాయి. పలుచోట్ల నిబంధనలు ఉల్లంఘించిన వారికి కౌన్సెలింగ్‌? ఇచ్చి జరిమానాలు వసూలు చేశారు. 

కరీంనగర్‌?: డ్రోన్లతో నిఘా 
ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో పోలీస్‌ కమిషనర్‌ కమలాసన్‌రెడ్డి స్వయంగా పలు ప్రాంతాల్లో తిరిగి పరిశీలించారు. లాక్‌డౌన్‌ అమలు తీరును పరిశీలించేందుకు పోలీసులు డ్రోన్‌ కెమెరాలను వినియోగించారు. సింగరేణి, ఎన్టీసీపీ, ఆర్‌ఎఫ్‌సీఎల్‌ కార్మికులు యథావిధిగా విధులకు హాజరయ్యారు. సిరిసిల్లలో వస్త్ర పరిశ్రమ పాక్షికంగా బంద్‌ అయింది.  

మెదక్‌: కిక్కిరిసిన దుకాణాలు 
ఉమ్మడి మెదక్‌ జిల్లావ్యాప్తంగా లాక్‌డౌన్‌ మినహాయింపు సమయంలో కూరగాయలు, కిరాణా దుకాణాలు కిక్కిరిసి కనిపించాయి. వైన్‌షాపుల వద్దా లైన్లు కనిపించాయి. సంగారెడ్డి జిల్లాలో లాక్‌డౌన్‌ ప్రశాంతంగా జరిగింది. 

నల్లగొండ: నిర్మానుష్యం 
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఉదయం 6 గంటలకే అన్ని వ్యాపారసంస్థలు తెరుచుకోగా.. 10 గంటలకల్లా రోడ్లన్నీ ఖాళీ అయిపోయాయి. హైదరాబాద్‌ –విజయవాడ 65వ నంబర్‌ జాతీయ రహదారి ఖాళీగా కనిపించింది. 

నిజామాబాద్‌: సరిహద్దులు బంద్‌? 
ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో పోలీసులు ఉదయం 9.30 గంటల నుంచే ప్రజలను ఇళ్లకు వెళ్లిపోవాల్సిందిగా సూచనలు చేశారు. జిల్లాకు మహారాష్ట్రతో ఉన్న పలు సరిహద్దుల్లో గట్టి నిఘా పెట్టారు. ఎమర్జెన్సీ మినహా రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు. 

ఆదిలాబాద్‌: సరిహద్దుల్లో కాపలా 
ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో జనం పెద్దసంఖ్యలో బయటికి రావడంతో మార్కెట్లు కిక్కిరిసిపోయాయి. మహారాష్ట్ర నుంచి జిల్లాలోకి ఎవరూ రాకుండా సరిహద్దుల్లో గట్టి కాపలా పెట్టారు.  

వరంగల్‌: జనానికి ఇబ్బందులు 
నిబంధనలపై జనంలో అవగాహన లేకపోవడంతో వ్యాక్సినేషన్‌ కోసం కూడా జనాలు బయటికి రా లేదు. వరంగల్‌ పట్టణంలో బస్సులు చాలా వరకు నిలిచిపోయాయి. ఈ విషయం తెలియక వివిధ ప్రాంతాల నుంచి వచ్చి, మరో ప్రాంతానికి వెళ్లా ల్సిన వారు బస్టాండ్లలో ఇబ్బందులు పడ్డారు. వివి« ద రాష్ట్రాలకు వెళ్లాల్సిన వలస కార్మికులు రైళ్ల కోసం కాజీపేట జంక్షన్‌లో వేచి ఉండడం కనిపించింది. 

ఖమ్మం: పక్కాగా లాక్‌డౌన్‌ 
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో లాక్‌డౌన్‌ పక్కాగా అమలైంది. వ్యాపారులు తమ దుకాణాలను 10 గంటలకల్లా మూసివేశారు. పోలీసులు ఎక్కడికక్కడ తనిఖీలు చేపట్టి అనవసరంగా బయటకు వచ్చిన వారిని వెనక్కి పంపారు.  

పాలమూరు: అంతటా కట్టుదిట్టం
మహబూబ్‌నగర్‌లో మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ లాక్‌డౌన్‌ను స్వయంగా పర్యవేక్షించారు. ఉదయం 10 గంటల తర్వాత తిరుగుతున్న వాహనదారులను ఆపి ప్రశ్నిం చారు. గద్వాల జిల్లాలో కర్ణాటక సరిహద్దులో చెక్‌పోస్టుల వద్ద తనిఖీలు చేశారు.

మరిన్ని వార్తలు