పటిష్టంగా లాక్‌డౌన్‌.. 5,614 వాహనాలు సీజ్‌

22 May, 2021 21:46 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో లాక్‌డౌన్‌ పటిష్టంగా అమలవుతుంది. లాక్‌డౌన్‌ నిబంధనలు పాటించనివారిపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. రాచకొండ కమిషనరేట్‌ పరిధిలో లాక్‌డౌన్‌ను పటిష్టంగా అమలు చేస్తున్న పోలీసులు మూడు రోజుల్లోనే 5,614 వాహనాలను సీజ్‌ చేశారు. కాగా ఇవాళ ఒక్కరోజే దాదాపు రెండు వేల వాహనాలు సీజ్‌ చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

రాష్ట్రంలో మే 12 నుంచి లాక్‌డౌన్‌ అమల్లో ఉండగా.. ఇప్పటికవరకు 30 వేల కేసులు నమోదు చేసినట్లు స్పష్టం చేశారు. కాగా రాచకొండ కమిషనరేట్‌ పరిధిలో 46 చెక్‌ పోస్టులు ఏర్పాటు చేసినట్లు పోలీస్‌ అధికారులు స్పష్టం చేశారు. కాగా రాష్ట్రంలో లాక్‌డౌన్‌ మే 30 వరకు అమల్లో ఉన్న సంగతి తెలిసిందే. లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లఘించి అనవసరంగా రోడ్ల మీదకు వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సీపీలు అంజనీ కుమార్‌, సజ్జనార్‌లు హెచ్చరించారు. 

కాగా  తెలంగాణలో వైర‌స్ వ్యాప్తి కొన‌సాగుతోంది. గ‌డిచిన 24 గంట‌ల్లో రాష్ట్రంలో కొత్తగా 3308 కరోనా కేసులు న‌మోద‌య్యాయి. కోవిడ్ బాధితుల్లో 21 మంది మ‌ర‌ణించారు. గత 24 గంటల్లో కరోనా నుంచి కోలుకుని 4723 మంది డిశ్చార్జ్ కాగా.. ఇప్పటివరకు మొత్తం 5,04,970 మంది డిశ్చార్జ్ అయ్యారు. తెలంగాణలో ప్రస్తుతం 42,959 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. తెలంగాణలో కరోనాతో ఇప్పటివరకు 3106 మంది మృతి చెందారు.
చదవండి: కనిపించని శత్రువుతో సమష్టి యుద్ధం

మరిన్ని వార్తలు