Photo Story: వరదపాశం పెద్దబండపై పోసి..

23 Jun, 2021 09:16 IST|Sakshi

అచ్చంపేట రూరల్‌: వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్న తమ తల్లిదండ్రులు వర్షం రాక కోసం ఎదురుచూస్తుండటం చూసి మంగళవారం కొంతమంది చిన్నారులు, యువకులు గ్రామ సమీపంలోని పెద్దబండపై వరదపాశం పోశారు. నాగర్‌కర్నూల్‌ జిల్లా అచ్చంపేట మండలం నడింపల్లిలో ఆలయాల్లో వర్షం కోసం పూజలు చేశారు. కప్పకావడితో ఊరంతా తిరిగారు. పోగైన డబ్బులతో వరదపాశం తయారుచేశారు. అనంతరం పెద్దబండపై పోసి ఆరగించారు. ఇలా చేస్తే వర్షాలు సమృద్ధిగా పడతాయని వారి నమ్మకం.   

 


ఖమ్మం: ప్రయాణికుల సౌకర్యార్థం బస్సే..షెల్టర్‌గా మారింది. ఖమ్మం నగరం నుంచి ఇల్లెందు వైపు వెళ్లే ప్రయాణికుల కోసం ఎన్టీఆర్‌ సర్కిల్‌ వద్ద బస్‌షెల్టర్‌ లేదు. దీంతో ఆర్టీసీ అధికారులు ఓ బస్‌ను ఇలా ఉంచి..తాత్కాలిక బస్‌ షెల్టర్‌ అంటూ ఫ్లెక్సీ కట్టారు.
-సాక్షి ఫొటో జర్నలిస్ట్, ఖమ్మం 

సిద్దిపేట కలెక్టరేట్‌లో ‘చైల్డ్‌ కేర్‌’ 
సాక్షి, సిద్దిపేట: సిద్దిపేట సమీకృత కలెక్టరేట్‌లో చైల్డ్‌ కేర్‌ విభాగాన్ని ఏర్పాటు చేస్తున్నారు. చిన్నపిల్లలు ఉన్న మహిళా ఉద్యోగులతోపాటు, కార్యాలయానికి వివిధ పనుల నిమిత్తం పిల్లలతో వచ్చే తల్లులకు సైతం ఇబ్బందులు లేకుండా ఈ నిర్ణయం తీసుకున్నారు. పిల్లల కోసం ప్రత్యేక గది, ఆడుకోవడానికి గార్డెన్‌ను తీర్చిదిద్దుతున్నారు. మహిళా ఉద్యోగుల పిల్లలను బేబీ కేర్‌కు పంపించకుండా విధులు నిర్వర్తిస్తూ వారిని చూసుకునేలా సిద్ధం చేస్తున్నారు. మూడేళ్లలోపు పిల్లలకు ప్రీ స్కూల్‌ యాక్టివిటీ, ఆటలు, పాటలు నేర్పించేందుకు అంగన్‌వాడీ టీచర్‌ను సైతం నియమించనున్నారు.

చదవండి: ఎంపీ కోమటిరెడ్డికి అవమానం: సీఎం కేసీఆర్‌ సభకు అందని ఆహ్వానం

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు