ఫొటోలు తీశాడని ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌పై దాడి

20 Mar, 2021 08:56 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

లారీ యజమాని, డ్రైవర్‌ అరెస్టు

సాక్షి, మణికొండ: ట్రాఫిక్‌ నిబంధనలు పాటించని వాహనాల ఫొటోలు తీస్తున్న కానిస్టేబుల్‌పై దాడిచేసి గాయపర్చిన ఓ లారీ డ్రైవర్‌తో పాటు యజమానిని నార్సింగి పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఎస్సై బలరాంనాయక్‌ తెలిపిన వివరాల ప్రకారం... శుక్రవారం ఉదయం నార్సింగి చౌరస్తాలో విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ మల్లేశ్‌ తన విధుల్లో భాగంగా నిబంధనలు పాటించని వాహనాల ఫొటోలు తీస్తున్నారు. అదే క్రమంలో అటుగా వచ్చిన టిప్పర్‌ డ్రైవర్‌ కానిస్టేబుల్‌పై దాడి చేశాడు. దీంతో కానిస్టేబుల్‌ నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేయటంతో లారీ డ్రైవర్‌ రఫీక్, యజమాని రమణలను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.     

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు