మళ్లీ వాయుగుండం

18 Oct, 2020 01:43 IST|Sakshi

అరేబియా సముద్రంలో వాయుగుండం 

దీంతో మహారాష్ట్ర, కర్ణాటక సరిహద్దు జిల్లాల్లో వర్షాలు  

సాక్షి, హైదరాబాద్‌: తూర్పు మధ్య అరేబియా సముద్రం, దాన్ని ఆనుకుని ఉన్న ఈశాన్య అరేబియా సముద్ర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం శనివారం వాయుగుండంగా మారినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. సౌరాష్ట్రకు దక్షిణ దిశగా, ముంబై నగరానికి పశ్చిమ వాయవ్య దిశగా ఈ వాయుగుండం కేంద్రీకృతమైనట్లు తెలిపింది. దీని ప్రభావంతో మహారాష్ట్ర, కర్ణాటక సరిహద్దు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ వివరించింది. ఈ వాయుగుండం ప్రభావం రానున్న 48గంటల పాటు కొనసాగి క్రమంగా బలహీనపడే అవకాశముందని పేర్కొంది. కాగా, పశ్చిమ మధ్య బంగాళాఖాతం నుంచి ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని తెలిపింది. దీంతో రాష్ట్రంలో పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఈనెల 19న మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశముందని, ఇది తదుపరి 24 గంటల్లో బలపడనుందని హెచ్చరించింది.   

మరిన్ని వార్తలు