మధ్య బంగాళాఖాతంలో "అల్పపీడనం"

20 Oct, 2020 13:44 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మధ్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాలలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. దాని ప్రభావం వలన ఈ ప్రాంతంలో ఈరోజు (మంగళవారం) ఉదయం 08.30 గంటలకు అల్పపీడనం ఏర్పడింది. దీనికి అనుబంధంగా 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఇది మరింత తీవ్రంగా మారే అవకాశం ఉంది. ప్రారంభములో ఇది రాగల 48 గంటలలో వాయువ్య దిశగా ప్రయాణించి తదుపరి 3 రోజులలో ఇది ఉత్తర ఈశాన్య దిశగా ప్రయాణించే అవకాశం ఉంది.దీని ప్రభావంతో తెలంగాణతో పాటు ఏపీలోనూ అక్కడక్కడ భారీ వర్షాలు, పలు చోట్ల మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వివరించింది. 
 

మరిన్ని వార్తలు