28న అల్పపీడనం: నేడు, రేపు తేలికపాటి వానలు 

26 Jul, 2021 07:49 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

ఈనెల 28న ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం  

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రానికి పశ్చిమ దిశ నుం చి తక్కువ ఎత్తులో బలంగా గాలులు వీస్తున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రస్తుతం నైరుతి రుతుపవనాలు చురుకుగా కదులుతున్నప్పటికీ బలమైన గాలుల కారణంగా వానలు తగ్గుముఖం పట్టినట్లు నిపుణులు విశ్లేషిస్తున్నారు. రాష్ట్రంలో సోమ, మంగళవారాల్లో కొన్ని చోట్ల తేలిక పాటి వానలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా వేసింది. ఉత్తరాది జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది.

ఈ నెల 28న ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలో ప్రస్తుత నైరుతి సీజన్‌లో ఆదివారం నాటికి 32.45 సెం.మీ. సాధారణ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా.. 54.39 సెం.మీ. వర్షపాతం నమోదైంది. సాధారణం కంటే 68 శాతం అధికంగా వర్షాలు కురిసినట్లు రాష్ట్ర ప్రణాళిక శాఖ తెలిపింది. 23 జిల్లాల్లో అత్యధిక వర్షపాతం నమోదు కాగా, 10 జిల్లాల్లో అధిక వర్షపాతం నమోదైంది.  
 

మరిన్ని వార్తలు