వైద్యురాలికి ఊపిరితిత్తుల మార్పిడి.. లక్నో టు హైదరాబాద్‌

12 Jul, 2021 07:24 IST|Sakshi

కోవిడ్‌తో దెబ్బతిన్న యువ వైద్యురాలి  ఆరోగ్యం

ఊపిరితిత్తుల మర్పిడి చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలింపు 

సాక్షి, రాంగోపాల్‌పేట్‌: లక్నోకు చెందిన ఓ వైద్యురాలిని ఊపిరితిత్తుల మార్పిడి కోసం సికింద్రాబాద్‌ కిమ్స్‌ ఆస్పత్రికి ఎయిర్‌ అంబులెన్స్‌లో తీసుకొచ్చారు. కిమ్స్‌ ఆస్పత్రి వర్గాలు తెలిపిన మేరకు.. లక్నోలోని లోహియా ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌కు చెందిన డాక్టర్‌ సుమన్‌ అనే పీజీ రెసిడెంట్‌కు ఏప్రిల్‌ 14న కోవిడ్‌ సోకింది. అప్పటికే ఆమె 8 నెలల గర్భిణి. ఊపిరితిత్తులు దెబ్బతిని పరిస్థితి విషమించడంతో వెంటిలేటర్‌పై ఉంచి మే 1న సిజేరియన్‌ ద్వారా బిడ్డను కాపాడారు.

అనంతరం ఆమెను ఎక్మో సపోర్ట్‌ మీద ఉంచారు. అయినా ఆరోగ్యం ఏమాత్రం మెరుగుపడలేదు. ఊపిరితిత్తుల మార్పిడి తప్ప గత్యంతరం లేదని వైద్యనిపుణులు చెప్పారు. దీంతో ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం వైద్యురాలి చికిత్స కోసం రూ.1.5 కోట్లు మంజూరు చేసింది. అనంతరం ఆమెను లైవ్‌ సపోర్ట్‌ అంబులెన్స్‌ ద్వారా లక్నో విమానాశ్రయానికి.. అక్కడి నుంచి ఎయిర్‌ అంబులెన్స్‌ ద్వారా  హైదరాబాద్‌కు తీసుకువచ్చారు.   

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు