లంగ్స్‌ కుదేలే...!

6 Nov, 2020 07:20 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కరోనా వైరస్‌ వ్యాప్తి మొదట్లో.. దాని లక్షణాలేంటో, అదెలా సోకుతుందో తెలియక వైద్యనిపుణులు, పరిశోధ కులు తల్లడిల్లారు. అయితే త్వరలోనే దీనిపై భారతీయ వైద్యులు ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లోని పల్మొనాలజీ, ఇతర రంగాల వైద్యులు స్పష్టత సాధించి మహమ్మారి కట్టడిలో మంచి ఫలితాలను సాధిస్తున్నారు. వివిధ స్థాయిల్లో మెరుగైన చికిత్స విధానాలను అవలంబిస్తూ, రోగులు ఏ లక్షణాలు, ఆరోగ్య సమస్యలతో వస్తే ఎలాంటి చికిత్స అందించాలి?, ఏ మందుల కాంబినేషన్‌ వాడాలనే దానిపై స్పష్టత సాధించారు. కోవిడ్‌ మహమ్మారి ప్రధానంగా ఊపిరితిత్తులపై అధిక ప్రభావం చూపుతోంది. ఆ దిశగా చికిత్స అందించిన క్రమంలో తమకెదురైన అనుభవాలను, ముఖ్య విషయాలను శ్వాసకోశ వ్యాధుల నిపుణులు డాక్టర్‌ హరికిషన్‌ గోనుగుంట్ల, డాక్టర్‌ విశ్వనాథ్‌ గెల్లా, డాక్టర్‌ వి.వి.రమణ›ప్రసాద్‌ ‘సాక్షి’తో పంచుకున్నారు. అవేమిటో వారి మాటల్లోనే..

ఊపిరితిత్తులపై తీవ్ర ప్రభావం
శరీరంలోని కణాల్లోకి వైరస్‌ ప్రవేశానికి ఆంజియో టెన్సిన్‌–కన్వర్టింగ్‌ ఎంజైమ్స్‌ (ఏసీఈ–2) రిసెప్టర్స్‌ కారణం. ఇతర అవయవాలతో పోలిస్తే ఊపిరితిత్తుల్లో ఏసీఈ–2 రిసెప్టర్స్‌ ఎక్కువ. గుండె, ఇంటెస్టీన్స్, కిడ్నీలు, టెస్టికల్స్‌లోనూ ఇవి తగు మోతాదులో ఉంటాయి. అందువల్లే కరోనా కారణంగా ఊపిరితిత్తులు ప్రభావితమవుతున్నాయి. ఆపై గుండె, రక్తనాళాలు, కిడ్నీలు, మెదడుపై కొంత ప్రభావం పడుతోంది. వైరస్‌ నుంచి కోలుకున్నాక కూడా చాలామందిని కోవిడ్‌ సమస్యలు పీడిస్తున్నాయి. దీని నుంచి పూర్తిగా కోలుకునేందుకు 3 నుంచి 6 నెలలు పడుతోంది. దీర్ఘకాలం కొనసాగే కోవిడ్‌ సమస్యలతో లంగ్స్‌ ఫైబ్రోసిస్‌తో ఊపిరితిత్తులు, గుండె సంబంధ రుగ్మతలు పెరుగుతాయి. ఐసీయూ చికిత్స నుంచి బయటికొచ్చాక పేషెంట్లను ‘క్రిటికల్‌ ఇల్‌నెస్‌ న్యూరోపతి’ సిండ్రోమ్‌ బాధపెడుతోంది.

వైరస్‌ ప్రభావంతో గుండెలయల్లో హెచ్చుతగ్గులు, గుండె కండరాల టిష్యూ గట్టిపడి కార్డియోమైయోపతి ఏర్పడి గుండెకు రక్తాన్ని పంప్‌ చేయడం కష్టమవుతుంది. తాజా సమాచారం ప్రకారం..కోవిడ్‌తో మెదడుకు సంబంధించి వైరల్‌ ఎన్‌సిఫిలిటీస్, గులియన్‌ బారి డిసీజ్‌తో పాటు పాలిన్యూరోపతి, సెరబ్రల్‌ స్ట్రోక్స్‌ సమస్యలు ఎదురవుతున్నాయి. కరోనా పేషెంట్లలో దాదాపు సగం మందికి మూత్రంలో రక్తం లేదా ప్రొటీన్‌ కనిపించడం ద్వారా కిడ్నీ డామేజ్‌ ప్రారంభదశ మొదలవుతోంది.
– డాక్టర్‌ హరికిషన్‌ గోనుగుంట్ల, యశోద ఆస్పత్రి చీఫ్‌ ఇంటర్వెన్షనల్‌ పల్మొనాలజిస్ట్‌

ఇక్కడ రెమ్‌డెసివిర్‌ బాగానే పనిచేస్తోంది
పశ్చిమ దేశాల్లో ‘రెమ్‌డెసివిర్‌’ పనితీరుపై డబ్ల్యూహెచ్‌వో పెద వి విరిచినా.. హైదరాబాద్‌లో ఇది బా గానే పనిచేసింది. వైరస్‌ తీవ్రత పెరిగేకొద్దీ వెంటిలేటర్‌ అమర్చాల్సిన పరిస్థితి నుం చి ఇది పలువురిని కాపాడింది. ఇక, కోవిడ్‌ వచ్చి తగ్గాక కొందరు 12 వారాల తర్వాత, కొందరు నెలలోనే అకస్మికంగా వస్తున్న జ్వరం, దగ్గు, ఆయాసాలతో ఆసుపత్రులకు వస్తున్నారు. శరీరంలో ఇంకా ఇన్ఫెక్షన్‌ మిగలడం వల్లే ఇలా జరుగుతోంది. వైరస్‌లో ఆర్‌ఎన్‌ఏ పికప్‌ అయిన నెల తర్వాత కూడా కొందరికి పాజిటివ్‌గా రిపోర్ట్‌లు వస్తున్నాయి. లంగ్‌ ఫైబ్రోసిస్‌ వల్ల ఆక్సిజన్‌ స్థాయి తగ్గిన వారికి 24 గంటలపాటు ప్రాణవాయువునివ్వాలి.

కొన్ని కేసుల్లో ‘లంగ్‌ ట్రాన్స్‌ప్లాంట్‌’ కూడా చేయా ల్సి వస్తోంది. ఊపిరితి త్తులు పాడై, ఇతర ట్రీట్‌మెంట్లు పనిచేయని వారికి పోస్ట్‌–కోవిడ్‌ ట్రాన్స్‌ప్లాంట్‌ చేయాలి. చలికాలంలో ఇన్‌ఫ్లుయెంజా వైరస్, ఇతర వైరల్‌ ఇన్ఫెక్షన్లతో ఆస్తమా, బ్రాంకైటీస్, కిడ్నీ, టీబీ, షుగర్, గుండెజబ్బులు వంటి దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలున్న వారిపై ప్రభావం ఎక్కువుంటుంది. వీరు ఇన్‌ఫ్లుయెంజా వ్యాక్సిన్లు తీసుకోవాలి.         
- డాక్టర్‌ వి.వి.రమణప్రసాద్, కిమ్స్‌ కన్సల్టెంట్‌ పల్మొనాలజిస్ట్‌

‘సెకండ్‌ వేవ్‌’ వస్తే కష్టమే
స్పెయిన్, ఫ్రాన్స్, జర్మనీ, అమెరికా మాదిరిగా మన తెలుగు రాష్ట్రాల్లో సెకండ్‌వేవ్‌ వస్తే చాలా కష్టం. నవం బర్, డిసెంబర్‌లలో కేసులు పెరగొచ్చు. మరో 6 నెలల పాటు రెండింతల జాగ్రత్తలు అవసరం. మాస్క్‌లు, ఇత ర జాగ్రత్తలు కచ్చితంగా పాటించాలి. ఇప్పటికీ 30% మంది మాస్క్‌లు సరిగా ధరించట్లేదు. ముఖ్యంగా బయటి ఆహారం తీసుకునేపుడు మాస్క్‌లు తీసేస్తున్నారు. అటువంటప్పుడే వైరస్‌ సోకే అవకాశాలెక్కువ. పెద్ద వయస్కులు, గుండె, కిడ్నీ ఇతర సమస్యలున్న వారు ఇళ్లలోనూ మాస్క్‌లు ధరించాలి. దసరా సందర్భం గా ఎంతమేరకు ఇన్ఫెక్షన్‌ పెరిగిందో ఇంకా స్పష్టత రాలేదు. దీపావళి, కార్తీకమాసం సందర్భంగా వైరస్‌ వ్యాప్తికి అవకాశాలెక్కువ.

కరోనా తగ్గిపోయినట్టుగా భావిస్తున్న 30–40 ఏళ్లలోపు వారు బయట ఇన్‌ఫెక్ట్‌ అయి.. ఇళ్లలోని పెద్దలు, అనారో గ్య సమస్యలున్న వారికి అంటించే ప్రమాదం ఎక్కువుం ది. ఇక, నరాలపై ప్రభావం చూపే ‘గులియన్‌ బారీ సిం డ్రోమ్‌’తో కోవిడ్‌ కొత్త కేసులు వెలుగుచూస్తున్నాయి. చర్మంపై దద్దుర్లు, గ్యాంగ్రిన్, రక్తనాళాలు మూసుకుపో యి పేగులకు సరిగా రక్తప్రసారం జరగకపోవడం వంటివి బయట పడుతున్నాయి. ఇమ్యూనిటీ తగ్గిపోయి యూరిన్, బ్లడ్, టీబీ, ఇతర ఇన్ఫెక్షన్లు పెరుగుతున్నాయి. కొం దరిలో ఊపిరితిత్తులకు నష్టం వాటిల్లి ‘లంగ్‌ ట్రాన్స్‌ప్లాంట్‌’ చేయాల్సిన అవసరం ఏర్పడుతోంది.
 –డా.విశ్వనాథ్‌ గెల్లా, ఏఐజీ, డైరెక్టర్, డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ పల్మొనాలజీ 

మరిన్ని వార్తలు