వరద నీటిలో చిక్కుకున్న వ్యక్తిని కాపాడిన మధిర సీఐ

10 Oct, 2020 08:35 IST|Sakshi
రాఘవయ్యను కాపాడిన సీఐ

మధిర: తన ప్రాణాలను పణంగా పెట్టారు. ఒక సామాన్యుడి ప్రాణాలు కాపాడారు. మానవత్వాన్ని చాటుకుని పలువురు ప్రశంసలు పొందారు ఖమ్మం జిల్లా మధిర సీఐ. మడుపల్లి గ్రామానికి చెందిన రాఘవయ్య శుక్రవారం చేపలు పట్టేందుకు వైరా నది వద్దకు చేరుకున్నాడు. నీటిలో చేపలు పట్టే క్రమంలో ఒక్కసారి వరద ప్రవాహం పెరిగింది. దీనిని గమనించిన రాఘవయ్య కేకలు వేస్తూ తన ప్రాణాలు కాపాడుకునేందుకు చెట్టు కొమ్మలు పట్టుకున్నాడు. దీనిని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. మధిర సీఐ వేణుమాధవ్, టౌన్‌ ఎస్‌ఐ ఉదయ్‌కుమార్‌ ఘటనా స్థలం వద్దకు చేరుకున్నారు. సీఐ వెంటనే నదిలోకి దిగి తాడు, ట్యూబు సహాయంతో నీటిలో చిక్కుకున్న బాధితుడి వద్దకు చేరుకుని వారిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. దీంతో రాఘవయ్య కుటుంబ సభ్యులు సీఐకి కృతజ్ఞతలు తెలిపారు. తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా వృత్తి ధర్మాన్ని పాటిస్తూ.. రాఘవయ్యను కాపాడిన సీఐ వేణుమాధవ్‌ ధైర్యసాహసాలను పలువురు ప్రశంసించారు. (ఐదేళ్ల తరువాత  అమ్మఒడికి..! )

మరిన్ని వార్తలు