24 గంటలు.. 19 కాన్పులు

19 Feb, 2023 05:38 IST|Sakshi

సాక్షి,నెహ్రూ సెంటర్‌: మహబూబాబాద్‌ జిల్లా ప్రభుత్వ జన­రల్‌ ఆస్పత్రిలో 24 గంటల్లో 19 కాన్పులు జరిగాయి. శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి శని­వా­రం ఉదయం 8 గంటల వరకు 19 ప్రసవాలు జరిగాయని, వాటిలో 15 సాధా­రణ, 4 సిజేరియన్‌ శస్త్రచికిత్సలు నిర్వ­హించినట్లు ఆస్పత్రి సూపరింటెండెంట్‌ శ్రీనివాసరావు తెలిపారు. ప్రసవాల్లో అధిక రిస్క్‌ కేసులు కూడా ఉన్నాయని, కానీ తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారని చెప్పారు.

ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు ఆదేశాల మేరకు సిజేరి­యన్‌ ప్రసవాలను తగ్గించి.. సాధారణ కా­న్పులను పెంచే ప్రయత్నంలో భాగంగా ప్రభుత్వ వైద్యులు, సిబ్బంది ఈ విజ­యం సాధించారని వివరించారు. కాన్పుల విభాగం అధిపతి డాక్టర్‌ బి.వెంకట్రాములు ఆధ్వర్యంలో స్త్రీ వైద్య నిపుణులు అలేఖ్య, శస్త్ర చికిత్స డ్యూటీ ని­పుణులు శైలజ, శ్రావణి, మత్తు విభాగం వైద్యులు శ్రవణ్‌కుమార్, శ్రీనివాస్‌ సేవలందించారని తెలిపారు. వారందరనీ కలెక్టర్‌ శశాంక అభినందించారని పేర్కొన్నారు.  

మరిన్ని వార్తలు