హోలీ వేడుకల్లో బీర్‌ సీసాలతో హల్‌చల్‌.. వివాదంలో టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే

18 Mar, 2022 14:58 IST|Sakshi

సాక్షి, మహబూబాబాద్‌: వరంగల్‌ ఉమ్మడి జిల్లాలో హోలీ సంబరాలు ఫుల్ జోష్ మధ్య జరుగుతున్నాయి. ఎక్కడ చూసినా, రంగు రంగుల కలర్స్‌, డాజే పాటలతో హోళీ సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. ఈ ఏడాది కరోనా ఆంక్షలు లేకపోవడం తో యువత పెద్ద ఎత్తున సంబరాల్లో పాల్గొన్నారు. ఈ క్రమంలో మహబూబాబాద్ జిల్లాలో హోలీ సంబరాలు ఘనంగా జరుపుకుంటున్నారు. హోలీ వేడుకల్లో టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే శంకర్ నాయక్ మందు బాటిళ్లతో హల్‌చల్‌ చేసి వివాదంలో చిక్కుకున్నారు. ఎమ్మెల్యే తన క్యాంపు కార్యాలయంలో హోళీ వేడుకల్లో భాగంగా బీర్ల వర్షం కురిపించారు. 

మందు బాటిల్‌తో స్టెప్పులు వేసి కార్యకర్తల్లో జోష్ నింపారు. కార్యకర్తలకు స్వయంగా మందు బాటిల్‌ నోట్లో పెట్టి ఎమ్మెల్యే మందు పోసి హంగామా సృష్టించారు. కార్యకర్తలు కూడా మద్యం కొట్టి ఎమ్మెల్యేతో సందడిగా హోలీ వేడుకల్లో పాల్గొన్నారు. హోలీ వేడుకలతో ప్రజాప్రతినిధులతో పాటు కార్యకర్తలు మద్యంతో హల్‌చల్‌ చేయడం స్థానికులను విస్మయానికి గురి చేసింది.
చదవండి: హోలీ వేడుకల్లో మంత్రి గంగుల కమలాకర్‌ డీజే స్టెప్పులు

మరిన్ని వార్తలు