‘కిలిమంజారో’ చాన్స్‌.. సాయం చేయండి ప్లీజ్‌

22 May, 2021 18:47 IST|Sakshi
భూక్యా జశ్వంత్‌

కిలిమంజారో అధిరోహణకు గిరిజన బాలుడి ఎంపిక

ప్రయాణానికి రూ.3 లక్షలు ఖర్చయ్యే అవకాశం

దాతల చేయూత కోసం ఎదురుచూపులు 

మరిపెడ రూరల్‌: ప్రపంచ ప్రసిద్ధి గాంచిన ఆఫ్రికా ఖండంలోని కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించడానికి మహబూబాబాద్‌ జిల్లా మరిపెడ మండలం భూక్యాతండాకు చెందిన బాలుడు ఎంపికయ్యాడు. భూక్యా రాంమూర్తి, జ్యోతి దంపతుల కుమారుడు భూక్యా జశ్వంత్‌ హైదరాబాద్‌ ఇబ్రహీంపట్నంలోని గిరిజన సంక్షేమ శాఖ రెసిడెన్షియల్‌ జూనియర్‌ కాలేజీలో ఎంపీసీ ఫస్టియర్‌ చదువుతున్నాడు.

జశ్వంత్‌కు చిన్నప్పటి నుంచి పర్వతారోహణ అంటే ఎంతో ఇష్టం. ఈ ఏడాది ఫిబ్రవరిలో యాదాద్రి భువనగిరి జిల్లాలో జరిగిన రాక్‌ౖక్లైంబింగ్‌ పోటీల్లో మొత్తం 40 మంది పాల్గొనగా జశ్వంత్‌ మొదటి స్థానంలో నిలిచాడు. ఈ క్రమంలోనే రాష్ట్రం నుంచి కిలిమంజారో పర్వ తం అధిరోహణకు జశ్వంత్‌ ఎంపికయ్యాడు.

జూలై 22న అతను బయలుదేరాల్సి ఉంది. ఇందుకు ప్రయాణ ఖర్చుల కింద రూ.3 లక్షలు అవసరం. దాతలు సహకారం అందిస్తే కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించి వస్తానని, భవిష్యత్‌తో మరిన్ని విజయాలు సాధించి దేశానికి మంచి పేరు తెస్తానని జశ్వంత్‌ ఈ సందర్భంగా తెలిపాడు. సాయం చేయదలచిన వారు 70750 13778 నంబర్‌ ద్వారా గూగుల్, ఫోన్‌ పే చేయాలని కోరాడు.  

మరిన్ని వార్తలు