వేప: అబ్బో చేదు.. కానీ ఈ బుడతడికి కాదు!

23 May, 2021 11:59 IST|Sakshi

3 పూటలా 10 చొప్పున తింటున్న వైనం

ఎలాంటి ఇబ్బందులు రావంటున్న వైద్యులు 

సాక్షి, ఊట్కూర్‌: చిన్నారులకు చాక్లెట్లు.. ఐస్‌క్రీంలు.. బిస్కెట్లు అంటేనే ఎంతో ఇష్టం.. వాటి కోసం అల్లరి చేయడం పరిపాటి. అలాంటిది ఓ బుడతడు మాత్రం మూడు పూటలా పది చొప్పున వేపాకులు తింటూ అందరినీ అబ్బురపరుస్తున్నాడు. వివరాల్లోకి వెళితే... నారాయణపేట జిల్లాలోని ఊట్కూర్‌కు చెందిన ఉమాదేవి, సూరం ప్రకాశ్‌ దంపతులకు కుమారుడు తనిష్క్‌ (15 నెలల బాలుడు) ఉన్నాడు. ఆరు నెలలుగా వేపాకును తింటున్నాడు. తండ్రి ఉదయం, సాయంత్రం వేళ వేప కొమ్మతో పళ్లు తోముకుంటూ.. వాటికున్న పూలను చిన్నోడు ముందు వేసేవారు.

ఆ చిన్నో డు ఆడుతూ.. పాడుతూ.. ఆ వేప పూలు తినేవాడు.. ప్రస్తుతం ఆకులు తినే అలవాటు చేసుకున్నాడు. రోజూ వేపాకు తింటే ఏమైనా అలర్జీ వచ్చిందా అనుకుంటే పొరపాటే.. అలాంటిదేమీ లేదంటున్నారు తల్లిదండ్రులు.. బిస్కెట్లు, చాక్లెట్లు తిన్నట్లుగా వేపాకును నములుతున్నాడని చెబుతున్నారు. దీనిపై నారాయణపేటలోని డాక్టర్‌ మదన్‌మోహన్‌రెడ్డిని సంప్రదించగా వేపాకులు తినడం వల్ల ఎలాంటి ఆరోగ్య ఇబ్బందులు రావన్నారు. ముఖ్యంగా చిన్నపిల్లల్లో యాంటీబాడీలు పెరుగుతాయన్నారు. 

చదవండి: కరోనా: వివాహంలో.. మాస్కులే పూల దండలు

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు