టీఆర్‌ఎస్‌తోనే తెలంగాణకు రక్ష 

3 May, 2022 03:19 IST|Sakshi
టీఆర్‌ఎస్‌లో చేరిన బీజేపీ నాయకులతో మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ 

మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ 

టీఆర్‌ఎస్‌లో చేరిన మహబూబ్‌నగర్‌ జిల్లా బీజేపీ నాయకులు  

జెడ్పీసెంటర్‌ (మహబూబ్‌నగర్‌): పోరాడి సాధించుకున్న తెలంగాణ అభివృద్ధి, రక్షణ టీఆర్‌ఎస్‌తోనే సాధ్యమని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడల శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. హైదరాబాద్‌లోని మంత్రి క్యాంపు కార్యాలయంలో మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన సుమారు 300మంది బీజేపీ నాయకులు మంత్రి సమక్షంలో సోమవారం టీఆర్‌ఎస్‌లో చేరారు. వీరిలో బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి సత్యంయాదవ్, కోయిల్‌కొండ మండలం రాంపూర్‌ గొర్రెల పెంపకందారుల సహకార సంఘం అధ్యక్షుడు పెద్ద రాములు యాదవ్‌ తదితరులు ఉన్నారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... ఈ చేరికలు జిల్లా అభివృద్ధికి మరింత దోహదం చేస్తాయన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ రాజేశ్వర్‌గౌడ్, ముడా చైర్మన్‌ గంజి వెంకన్న, జిల్లా రైతుబంధు కో–ఆర్డినేటర్‌ గోపాల్‌యాదవ్, మున్సిపల్‌ చైర్మన్‌ కేసీ నర్సిములు, వైస్‌ఛైర్మన్‌ గణేష్, గొర్రెల పెంపకందారుల సంఘం అధ్యక్షుడు శాంతన్న తదితరులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు