Telugu Book Of Records: పాలమూరు బుడ్డోడు ప్రతిభ అమోఘం

2 Oct, 2021 12:21 IST|Sakshi
Telugu Book Of Records: పాత్లావత్‌ పురందాస్‌కు ప్రశంసాపత్రం

బాలానగర్‌: మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థి తన ప్రతిభతో అందరినీ ఆకట్టుకుంటున్నాడు. తాజాగా ఆ విద్యార్థి తెలుగు బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్నాడు. వివరాలు ఇలా ఉన్నాయి. బాలానగర్‌ మండలంలోని నేరళ్లపల్లి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న పాత్లావత్‌ పురందాస్‌ విద్యార్థి తెలుగు బుక్‌ ఆఫ్‌ రికార్డులో చోటు సంపాదించాడు.
చదవండి: కీడు శంకించిందని గాంధీ విగ్రహాన్ని పక్కన పడేశారు 

ప్రముఖ కవి గిడుగు రామమూర్తి జయంతి (ఆగస్టు 29) సందర్భంగా ఆగస్టు 21 నుంచి 29వ తేదీ వరకు వారోత్సవాలు నిర్వహించారు. జూమ్‌ ఆప్‌ ద్వారా నిర్వహించిన కవితా పఠనంలో పురందాస్‌ పాల్గొని ప్రతిభ చాటాడు. ఈ సందర్భంగా తెలుగు బుక్‌ ఆఫ్‌ రికార్డులో చోటు దక్కించుకున్నాడు. నిర్వాహకులు విద్యార్థికి ప్రశంసా పత్రాన్ని అందించారు.
చదవండి: మద్యం తాగితే రూ.10 వేల జరిమానా

ఈ కార్యక్రమంలో దేశ విదేశాల నుంచి సుమారు వెయ్యి మందికి పైగా వ్యక్తులు ఇందులో పాల్గొన్నారు. ఈ విషయమై పాఠశాల తెలుగు అధ్యాపకురాలు చైతన్య భారతిని పాఠశాల హెచ్‌ఎం పాండురంగారెడ్డితో పాటు సర్పంచ్‌ ఖలీల్, గోపి, ఎంఎంసీ చైర్మన్‌ శేఖర్, ఉపాధ్యాయులు శ్రీనివాస్, ఉమాదేవి, రాజేందర్‌ రెడ్డి, మహేందర్‌ రెడ్డి, శారదాదేవి తదితరులు హర్షం వ్యక్తం చేశారు.  

మరిన్ని వార్తలు