అంబర్‌పేట ఎస్సైకి ‘మహానంది’ పురస్కారం

19 Jul, 2022 22:18 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: సాహితీ రంగానికి చేసిన విశిష్ట సేవలకు గుర్తింపుగా అంబర్‌పేట క్రైం విభాగం సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ టి. రామచందర్ రాజుకు ‘మహానంది’ పురస్కారం వరించింది. ఇటీవల జాతీయ విశ్వకర్మ సేవా ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో సిరిసిల్ల జిల్లా వేములవాడలో జరిగిన ‘తెలుగు వెలుగు’ మహానంది జాతీయ పురస్కారాల ప్రదానోత్సవ వేడుకలో రామచందర్ రాజు పురస్కారం స్వీకరించారు. చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవి శంకర్‌ అవార్డును ప్రదానం చేశారు. తన విధి నిర్వహణతో ఎస్సై రాజు ‘తెలంగాణ సాహితీ రత్న’ వంటి బిరుదుతో పాటు ఇప్పటివరకు 200కు పైగా అవార్డులు అందుకున్నారు.

మరిన్ని వార్తలు