భూ వ్యవహారంలో ఈటల కొడుకుపై ఫిర్యాదు

23 May, 2021 11:08 IST|Sakshi
భూ బాధితుడు మహేష్‌

సాక్షి, హైదరాబాద్‌: మాజీ మంత్రి, హుజూరాబాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ భూ వ్యవహారంలో ఓ భూ బాధితుడు ముఖ్యమంత్రి కే. చంద్రశేఖరరావుకి ఫిర్యాదు చేశాడు. ఈటల రాజేందర్‌ కొడుకు నితిన్‌ తన భూమిని కబ్జా చేడని ఆ ఫిర్యాదులో పేర్కొన్నాడు. మేడ్చల్‌ మండలం రావల్‌కోల్‌కు చెందిన మహేష్‌.. తనకు న్యాయం చేయాలంటూ సీఎంను కోరాడు.

బాధితుడు మహేష్‌ ఫిర్యాదుపై స్పందించిన సీఎం కేసీఆర్‌.. తక్షణమే దార్యాప్తు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌కుమార్‌ను ఆదేశించారు. ఏసీబీ‌, రెవిన్యూ శాఖలు సమగ్ర విచారణ చేసి నివేదిక ఇవ్వాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. ఇక తన భుమిని ఇనాం భూమిగా చూపుతూ కొనుగోలు చేసి ఇప్పుడు తమను ఆ భూమిలోకి రాకుండా బెదిరిస్తున్నారని మహేష్‌ బుధవారం మేడ్చల్‌ జిల్లా కలెక్టర్‌, కీసర ఆర్డీఓ కార్యాలయాల్లో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.

చదవండి: Huzurabad: వదిలే ప్రసక్తే లేదు.. ఈటల భూదందాలు బయటపెడతా!

మరిన్ని వార్తలు