నల్గొండలో ప్రేమ పేరుతో యువతిపై దాడి చేసిన యువకుడు అరెస్టు

10 Aug, 2022 15:34 IST|Sakshi

సాక్షి, నల్లగొండ : ప్రేమ పేరుతో  యువతిని వేధింపులకు గురి చేస్తూ, కత్తితో దాడి చేసిన ప్రమోన్మాది మీసాల రోహిత్‌ను నల్లగొండ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు జిల్లా ఎస్పీ రెమా రాజేశ్వరి బుధవారం మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. రోహిత్‌, బాధితురాలు క్లాస్‌మెట్స్‌ అని తెలిపారు. ప్రేమించాలని రోహిత్‌ ఒత్తిడి చేసేవాడని, గతంలోనూ గ్లాస్ పీస్‌తో అమ్మాయిని బెదిరించేవాడని పేర్కొన్నారు. యువతి ఒప్పుకోక పోవడంతోఫ్రెండ్‌తో ఫోన్‌ చేయించి పార్క్‌కు తీసుకెళ్లినట్లు పేర్కొన్నారు.

‘బాధితురాలు తన స్నేహితురాలుతో కలిసి పార్క్ వద్ద వెళ్లగా.. అక్కడ కొద్ది సేపు అందరూ కలిసి మాట్లాడుకున్నారు. తరువాత నిందితుడు పర్సనల్‌గా మాట్లాడాలని చెప్పి బాధితురాలిని పక్కకు తీసుకెళ్లాడు. ముందస్తు ప్లాన్ ప్రకారం కూరగాయల కత్తితో వచ్చిన రోహిత్ బాధితురాలిపై విచక్షణ రహితంగా దాడి చేశాడు. కడుపు, చేతులు, కాళ్లు, మొహం, పైన పొడిచి గాయపరిచి అక్కడినుండి పరారయ్యాడు.
సంబంధిత వార్త: ప్రేమించ లేదని.. కత్తితో పొడిచి.. నల్లగొండలో ప్రేమోన్మాది ఘాతుకం

మంగళవారం మధ్యాహ్నం నల్గొండ పట్టణంలోని ఫారెస్ట్ పార్క్‌లో అమ్మాయిపై హత్యాయత్నం జరిగిందని సమాచారం వచ్చింది. వెంటనే ఈ కేసు విచారణను డీఎస్పీకి అప్పగించాం. రోహిత్‌ను అరెస్ట్ చేశాం. కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలిస్తున్నాం’ అని వెల్లడించారు. ఈ కేసును త్వరితగతిన ఛేదించిన నల్లగొండ డీఎస్పీ నరసింహరెడ్డి, సీఐ గోపి, ఎస్‌ఐ వెంకట రెడ్డి, సిబ్బంది షకీల్, శ్రీకాంత్ అభినందించారు.
చదవండి: సినిమాకేం తీసిపోదు.. తాళి కట్టే సమయానికి పెళ్లిని అడ్డుకున్న యువతి

మరిన్ని వార్తలు