ఉపాధికి గల్ఫ్‌ వెళ్లి.. శవంలా తిరిగొచ్చి..

24 Feb, 2024 13:46 IST|Sakshi

ఎనిమిది నెలల క్రితం వివాహం

 గల్ఫ్‌ వెళ్లిన నాలుగు నెలలకే..

 గల్ఫ్‌లో బ్రెయిన్‌ స్ట్రోక్‌తో

 మండలవాసి మృత్యువాత 

జన్నారం: ఉన్న ఊరిని.. కట్టుకున్న భార్యను.. కనిపెంచిన తల్లీదండ్రులను వదిలి ఉపాధి కోసం గల్ఫ్‌ బాట పట్టిన యువకుడు శవమై తిరిగొచ్చాడు. బ్రేన్‌ స్టోక్‌తో 24 రోజుల క్రితం మృతిచెందగా అప్పటి నుంచి చివరి చూపు కోసం కుటుంబీకులు ఎదురుచూస్తున్నారు. జన్నారం మండలం దేవునిగూడ గ్రామానికి చెందిన కునారపు వెంకటేశ్‌(24) ఎనిమిది నెలల క్రితం వివాహం చేసుకున్నాడు. ఉన్న ఊరిలో ఉపాధి లేక ఆరు నెలల క్రితం ఏజెంట్‌కు డబ్బులు పెట్టి ఇరాక్‌ దేశంలోని ఇబ్రహిల్‌ పట్టణానికి వెళ్లాడు.

 విధులు నిర్వహిస్తుండగా జనవరి 30న బ్రేన్‌ స్ట్రోక్‌ వచ్చింది. వెంటనే కంపెనీ సిబ్బంది ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. అప్పటి నుంచి భర్త మృతదేహం కోసం కంటిలో నీరు కడుపులో దాచుకుని భార్య ఎదురుచూస్తోంది. శుక్రవారం పెట్టెలో భర్త మృతదేహం స్వగ్రామానికి రావడంతో భార్య రోదన ఎవరు ఆపలేకపోయారు. 

గల్ఫ్‌ కార్మికుల సంక్షేమ సంఘం వ్యవస్థాపకుడు కల్లెడ భూమన్న, వర్కింగ్‌ ప్రసిడెంట్‌ తిరుపతి,  సంఘం నాయకులు ఎల్లయ్య, కునారపు భీమరాజు మృతదేహం వద్ద నివాళులరి్పంచారు. ఈ సందర్భంగా అప్పుల పాలైనా  వెంకటేశ్‌ కుటుంబాన్ని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. మృతదేహం స్వగ్రామం రావడానికి సహకరించిన ఎమిగ్రేట్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు మంద భీంరెడ్డి, అంబులెన్స్‌ ఏర్పాటు చేసిన తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. 

whatsapp channel

మరిన్ని వార్తలు