అంబులెన్స్‌ ధరలు.. మోటారుసైకిల్‌పై మృతదేహం తరలింపు

29 May, 2021 12:01 IST|Sakshi
బైక్‌పై మృతదేహాన్ని తీసుకెళ్తున్న దృశ్యం  

సాక్షి, ఖమ్మం: అనారోగ్యంతో చనిపోయిన ఓ వృద్ధుడిని మోటారు సైకిల్‌పై కూర్చొబెట్టుకుని ఇంటికి తీసుకెళ్లిన సంఘటన శుక్రవారం మండలంలోని ఆత్కూరు సమీపంలో చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. మల్లారానికి చెందిన ఎర్రనాగుల నారాయణ(70)కు సుమారు వారం రోజుల నుంచి అనారోగ్యంతో బాధపడుతూ మధిరలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో చికిత్స పొందాడు. ఈ క్రమంలో శుక్రవారం గుండెల్లో నొప్పిగా ఉందని అతడు కుటుంబసభ్యులతో కలిసి మోటారుసైకిల్‌పై మధిరకు వస్తున్నాడు.

సిరిపురం గ్రామంలోని ఓ ఆర్‌ఎంపీ వద్ద చూపించుకోగా ఆయన మధిరలోని ఆసుపత్రిలో వైద్యం చేయించుకోమని సూచించాడు. మోటారుసైకిల్‌పై మధిరకు తీసుకెళ్తుండగా.. ఆత్కూరు సమీపంలోకి రాగానే ఒక్కసారిగా గుండెపోటు రావడంతో మోటారు సైకిల్‌పైనే మృతి చెందాడు. అంబులెన్సులో తీసుకెళ్దామంటే వేలాది రూపాయలు కిరాయి అడుగుతున్నారని అదే మోటారుసైకిల్‌పై ఇంటికి తీసుకెళ్లారు. 

చదవండి: ధోవతి ఫంక్షన్‌ తెచ్చిన తంటా..∙ 10 మందికి సోకిన కరోనా

మరిన్ని వార్తలు