ద్విచక్ర వాహనం..117 పెండింగ్‌ చలానాలు..

17 Nov, 2021 11:58 IST|Sakshi

సాక్షి, గన్‌ఫౌండ్రీ(హైదరాబాద్‌): ఒకే ద్విచక్ర వాహనంపై ఒకటికాదు రెండుకాదు ఏకంగా.. 117 చలానాలు పెండింగ్‌లో ఉన్నాయి. మంగళవారం సదరు వాహనాన్ని అబిడ్స్‌ ట్రాఫిక్‌ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అబిడ్స్‌ ట్రాఫిక్‌ ఇన్‌స్పెక్టర్‌ తెలిపిన వివరాలు.. హైదరాబాద్‌ కలెక్టరేట్‌ కార్యాలయం ఎదురుగా ట్రాఫిక్‌ పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు. హోండా యాక్టివా(ఏసీ09ఏయూ1727)నంబర్‌ యాక్టివాను ఆపి తనిఖీ చేశారు.

2015 సంవత్సరం నుంచి దాదాపు 117 చలానాలు పెండింగ్‌లో ఉండటంతో అవాక్కయ్యారు. హెల్మెట్‌,మాస్క్‌, నో పార్కింగ్‌లో నిలుపుతూ.. సదరు వాహనదారుడు ఇష్టారాజ్యంగా తిరుగుతున్నట్లు గుర్తించారు. రూ. 30 వేల పెండింగ్‌ చలానాలు ఉండటంతో వాహానాన్ని సీజ్‌ చేశారు.

మరిన్ని వార్తలు