ఇంటి నుంచి పారిపోయి ... హిజ్రాగా మారి!

1 Jul, 2021 10:14 IST|Sakshi
యువకుడిని కార్లో తీసుకెళ్తున్న తల్లిదండ్రులు

సాక్షి, వేములవాడ(పెద్దపల్లి) : పెద్దపల్లి జిల్లా మంజంపల్లికి చెందిన వి.మహేశ్‌ అనే యువకుడు రెండు నెలల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయి... వేములవాడకు చేరుకున్నాడు. ఈ ప్రాంతంలోని హిజ్రాలతో చేరిపోయి తన రూపం మార్చుకుని వారితోనే తిరుగుతున్నాడు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు బుధవారం వేములవాడకు చేరుకుని మహేశ్‌ గురించి ఆరా తీశారు. వేములవాడ పరిసరాల్లోని అగ్రహారం, తిప్పాపూర్, చంద్రగిరి ప్రాంతాల్లో వెతికారు. పట్టణంలోని జాత్రాగ్రౌండ్‌ వద్ద మహేశ్‌ కనిపించడంతో ఇంటికి రమ్మని ప్రోద్బలం చేశారు.

ఈ క్రమంలో హిజ్రాలకు మహేశ్‌ తల్లిదండ్రులకు వాగ్వాదం, తోపులాట జరిగింది. చివరికి మహేశ్‌ కాళ్లు కట్టేసి కారులో ఎక్కించుకుని తీసుకెళ్లారు. మంజంపల్లిలో ఆస్తిపరులుగా ఉన్న వీరికి ఒక్కగానొక్క కొడుకు అని, ఆ కొడుకు చెప్పాపెట్టకుండా రెండు నెలల క్రితం ఇంటి నుంచి వెళ్లొచ్చి ఇలా హిజ్రాలతో కలసిపోయాడంటూ స్థానికులకు మహేశ్‌ కుటుంబ సభ్యులు రోదిస్తూ పేర్కొన్నారు. పోలీసులకు సమాచారం అందేలోగానే వారు మహేశ్‌ను తీసుకెళ్లినట్లు తెలిసింది.

చదవండి: అనుమానంతో భార్యను హతమార్చిన భర్త   

మరిన్ని వార్తలు