డబుల్‌ బెడ్రూం ఇల్లు రాలేదని..

2 Jul, 2021 10:09 IST|Sakshi

సాక్షి, చందంపేట(నల్లగొండ) : మండల కేంద్రానికి చెందిన ఇరగదిండ్ల మల్లేశ్‌ అనే వ్యక్తి తనకు డబుల్‌ బెడ్రూం ఇల్లు లక్కీ డ్రాలో రాలేదని గురువారం తహసీల్దార్‌ కార్యాలయం ఎదురుగా ఉన్న సెల్‌టవర్‌ ఎక్కాడు. తనకు డబుల్‌ బెడ్రూం ఇల్లు కేటాయించే వరకు కిందికి దిగిరానని భీష్మించాడు. మల్లేశ్‌కు మద్దతుగా అతడి భార్య, కుటుంబ సభ్యులు రోడ్డుపై బైఠాయించారు. దీంతో లక్కీడ్రాలో ఇళ్లు రాని మరికొంత మంది కూడా బైఠాయించారు. విషయం తెలుసుకున్న ఎస్‌ఐ సందీప్‌నాయుడు ఘటనా స్థలానికి చేరుకొని ఫోన్‌లో మాట్లాడి మల్లేశ్‌ను కిందికి దించే ప్రయత్నం చేశారు.

స్పష్టమైన హామీ ఇచ్చే వరకు కిందికి దిగనని మల్లేశ్‌ చెప్పాడు. అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేయడంలో అధికారులు తమ ఇష్టానుసారంగా వ్యవహరించారని ఆరోపించాడు. సర్పంచ్‌ కవితఅనంతగిరి ఎమ్మెల్యేను ఫోన్‌ ద్వారా సంప్రదించారు. రాబోయే విడతలో డబుల్‌ బెడ్రూం ఇల్లు మంజూరు చేస్తామ ని హామీ ఇవ్వడంతోపాటు, ఎంపీడీఓ రాములునా­యక్, ఇన్‌చార్జ్‌ త­హ­సీల్దా ర్‌ ముక్తార్, ఎస్‌ఐ సందీప్‌నా­యుడు బాధితుడు, అతడి కుటుంబ సభ్యులతో మాట్లాడడంతో మల్లేశ్‌ టవర్‌ దిగాడు.   

చదవండి: దొరికితే దొంగ.. లేదంటే దొర 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు