Hyderabad: బ్లాక్‌ ఫంగస్‌తో కంటి చూపుకోల్పోయిన వ్యక్తి ఆత్మహత్య 

17 Jan, 2022 06:57 IST|Sakshi
ప్రతీకాత్మకచిత్రం

రాజేంద్రనగర్‌ (హైదరాబాద్‌): కరోనా, బ్లాక్‌ ఫంగస్‌తో మంచానికే పరిమితమై మనోవేదనకు గురైన ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన రాజేంద్రనగర్‌పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్‌స్పెక్టర్‌ కనకయ్య తెలిపిన వివరాల ప్రకారం రాజేంద్రనగర్‌ ప్రేమావతిపేట ప్రాంతానికి చెందిన నవీన్‌కుమార్‌(35) యూనివర్సిటీలో కాంట్రాక్టు ఉద్యోగి. ఆయనకు 2017లో వివాహమైంది. ప్రస్తుతం వీరికి రెండు సంవత్సరాల కుమారె సంతానం. 2020 సంవత్సరం మే నెలలో ఆయన కోవిడ్‌ బారినపడ్డాడు.

జూన్‌ నెలలో బ్లాక్‌ ఫంగస్‌ గురయ్యాడు. దీంతో చికిత్స పొందుతూ కంటి చూపు కొల్పొయాడు. కోలుకున్న అనంతరం ఇంటి వద్దే ఉంటున్నాడు. మంచానికే పరిమితమైన నవీన్‌కుమార్‌ తరచుగా మనోవేదనకు గురయ్యేవాడు. ఈ నెల 13వ తేదీన ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగి అపస్మారక స్థితికి చేరుకున్నాడు. నోట్లో నుంచి నురుగులు వస్తుండడంతో కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం ఉస్మానియాకు, అక్కడి నుంచి ఈఎస్‌ఐ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన శనివారం మృతి చెందాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.  

చదవండి: (Hyderabad: నగరంలో ఇద్దరు మహిళల అదృశ్యం..  ఫోన్స్‌ స్విచ్ఛాఫ్‌)

మరిన్ని వార్తలు